Sunday, March 22, 2026 12:14 PM
Sunday, March 22, 2026 12:14 PM

తిరుపతి అన్నప్రసాదంలో కీలక మార్పులు…!

తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు కీలక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. గత అయిదేళ్ళ పాటు తిరుమల ప్రతిష్ఠకు భంగం వాటిల్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలోని కీలక వ్యక్తులు వ్యవహరించిన నేపధ్యంలో ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా అన్నప్రసాదం విషయంలో నాణ్యత లేదనే ఆరోపణలు వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై విమర్శలతో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేసారు. ముఖ్యంగా బియ్యం నాణ్యత దారుణంగా ఉందనే విమర్శలు వచ్చాయి.

Also Read :ప్రభాకర్ రావు కోసం రేవంత్ కొత్త అస్త్రం…?

ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లడ్డు ప్రసాదం విషయంలో మార్పులు జరిగాయి. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం మెనూలో మార్పులు చేసారు టీటీడీ అధికారులు. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలను తయారు చేసింది టీటీడీ.

Also Read : వైసీపీ నేతలకు షెల్టర్ జోన్ గా బిజేపి, జనసేన

ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్ లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు మసాలా వడలు వడ్డించారు టీటీడీ అధికారులు. మసాలా వడలు రుచికరంగా వున్నాయి అని సంతృప్తి వ్యక్తం చేసారు భక్తులు. ఫిబ్ర‌వ‌రి 04 వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉంచితే ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపధ్యంలో టీటీడీలో భద్రత కొరకు కేంద్ర బలగాలను వాడుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. రద్దీ సమయాల్లో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను క్యూ లైన్ల వద్ద మొహరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్