Sunday, March 22, 2026 05:57 AM
Sunday, March 22, 2026 05:57 AM

కివీస్‌తో ఆఖరి టెస్టు.. మళ్లీ మూడు మార్పులతో టీమ్‌ ఇండియా

భారత్ లో క్రికెట్ పై అభిమానం పీక్స్ లో ఉంటుంది. క్రికెటర్లకు దేవుళ్ళకు కొందరు అభిమానులు సమప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. క్రికెటర్ల కాళ్ళపై పడటం, వాళ్ళ కోసం ఏదొకటి చేయడం చూస్తూనే ఉంటాం. అక్కడి వరకు బాగానే ఉంది గాని భారత క్రికెట్ అభిమానుల్లో ఓ మూర్ఖత్వ వైఖరి ఇప్పుడు క్రికెటర్లను కూడా భయపెడుతున్న విషయం. సాధారణంగా క్రీడల్లో గెలుపు ఓటమి సహజం. ప్రతీ మ్యాచ్ గెలవాలి అనే తపన ప్రత్యర్ధి జట్లకు కూడా ఉంటుంది. కానీ ఎప్పుడూ మన జట్టే గెలవాలి అనుకోవడం మూర్ఖత్వమే అవుతోంది.

Also Read: ఇదెక్కడి మిడిల్ ఆర్డర్ రా బాబూ…

నాలుగు నెలల క్రితం టి20 వరల్డ్ గెలిచింది టీం ఇండియా. అప్పుడు రోహిత్ శర్మను విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేసారు. అక్కడి వరకు ఓకే… ఇటీవల బంగ్లాదేశ్ తో టి20, టెస్ట్ సీరీస్ ను ఘనంగా గెలిచారు. అప్పుడు కూడా టీంకు తిరుగు లేదు అనుకున్నారు. ఇప్పుడు మాత్రం కివీస్ పై రెండు టెస్ట్ లు ఓడిపోవడాన్ని క్రికెట్ అభిమానులు ఓ అవమానంగా, పాపంగా, పెద్ద తప్పుగా, చట్ట వ్యతిరేక చర్యగా భావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జట్టు ఎప్పుడూ గెలిస్తే… బలంగా ఉందనే అనుకుంటారు, వరుసగా 12 టెస్ట్ సీరీస్ లు గెలిచింది ఇండియా. స్వదేశంలో అసలు తిరుగు లేదు కూడా.

Team India

కానీ ఇప్పుడు ఓడిపోయింది… మరక మంచిదే అన్నట్టు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ ఓటమి మంచిదే. మిడిల్ ఆర్డర్ వైఫల్యం, లోయర్ ఆర్డర్ లో కనీసం 5 ఓవర్లు బ్యాటింగ్ చేయలేకపోవడం, ఫాస్ట్ బౌలింగ్ లోపాలు అన్నీ బయటపడ్డాయి. వీటిని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఒకవేళ ఈ రెండు టెస్టుల్లో టీం ఇండియా గెలిచినా… స్పిన్ తోనే గెలిచి ఉండేది. జట్టు బలంగా ఉందనే భావనలో యాజమాన్యం కూడా ఉండేది. ఆసిస్ పర్యటనలో బొక్క బోర్లా పడే పరిస్థితి వచ్చేది. కాబట్టి అభిమానులు ఆటగాళ్లపై కత్తులు దూయడం తగ్గించి ఓటమి విషయంలో అర్ధం చేసుకుని అడుగులు వేయడం మంచిది.

Also Read: సంచలన అతిథులతో సీజన్ 4 అన్ స్టాపబుల్ షో

ఇక ముంబయిలోని వాంఖడే వేదికగా కివీస్ తో చివరి టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. ఈక్రమంలో మూడో టెస్టులో మరోసారి మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులోనూ మూడు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల్లో ఓటమితో ఆటగాళ్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో జట్టులో కొత్త శక్తిని నింపేందుకు కొందరు కీలక ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్