Wednesday, February 4, 2026 04:08 PM
Wednesday, February 4, 2026 04:08 PM

టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్..!

టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌ లతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.. కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేసారు.

Also Read : జగన్‌కు షాక్ ఇవ్వనున్న మరో మాజీ..!

2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు వద్దకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని కోరారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టాం….ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తాం…ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టండని నేతలకు సూచించారు.

Also Read : సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు సంచలన కామెంట్స్

గత 5 ఏళ్లు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారు..వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల విజయమని స్పష్టం చేసారు. కార్యకర్తలను ఎప్పుడూ గౌరవించుకోవాలి… ఎన్నికలు అయిపోయాయి నేను ఎమ్మెల్యే, ఎంపి అయిపోయాను అని ఎవరూ భావించవద్దన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్(క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలని ఆదేశించారు.

Also Read : బాబీతో సినిమా చేస్తే పద్మ గ్యారెంటీ..?

పదవులు పొందే ప్రతి ఒక్కళ్లు పార్టీ స్ట్రక్చర్ అయిన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లో ఉండాలి. అలాంటి వారినే పదవుల కోసం నాయకులు సిఫారసు చేయాలన్నారు. ఏ స్థాయి వారు అయినా క్యూబ్స్‌ లో మెంబర్‌గా ఉండాలని 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయి.. 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. జూన్‌ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామన్నారు. పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తాం…దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయన్నారు. మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్