Saturday, September 13, 2025 04:50 AM
Saturday, September 13, 2025 04:50 AM
roots

వారిని తాట తీయండి.. బాబు సంచలన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ కార్యకర్తలు కూడా పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఉచిత ఇసుక అయినా కూడా ఇబ్బందులు వస్తున్నాయని ఇసుక అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక కేసులు కూడా నమోదు చేస్తున్నారని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు చంద్రబాబు దృష్టికి వెళ్ళాయి.

దీనిపై శనివారం మధ్యాహ్నం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమం వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేసారట. కఠిన చర్యలకు వెనుకాడవద్దని గునుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారంపై సిఎం ఆందోళన వ్యక్తం చేస్తూ కొన్ని పోస్ట్ లను కూడా వారికి చూపించారట.

Read Also : కూల్చేయ్ రేవంత్.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్

ప్రజలను తప్పుదారి పట్టించేలా సాగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని మీనాను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఉద్దేశ పూర్వక అబద్దాలతో ఉచిత ఇసుకపై ప్రజలలో అనుమానాలు రెకెత్తెలా ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారట. కలెక్టర్లు, ఎస్ పిలకు తగిన అదేశాలు జారీ చేసి, ఈ తరహా వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని మీనాను సిఎం ఆదేశించడం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానంపై జిల్లా స్ధాయిలో నిజనిజాలను వెలికితీసి, బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని గనులశాఖ ముఖ్య కార్యదర్శికి సిఎం స్పష్టమైన అదేశాలు ఇచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్