Wednesday, February 4, 2026 04:07 PM
Wednesday, February 4, 2026 04:07 PM

కడప జిల్లా స్వీప్ చెయ్యాలి.. చంద్రబాబు సంచలన కామెంట్స్

కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత సిఎం చంద్రబాబు నాయుడు, పార్టీ అగ్ర నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లక్షలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు ప్రసంగించారు. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని.. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే జోరు అన్నారు చంద్రబాబు. కడపలో మహానాడు ఏపీ దశ దిశను నిర్దేశిస్తుందన్నారు ఆయన. కడప జిల్లాలో 10స్థానాలకు 7 గెలిచి సత్తా చాటామని పేర్కొన్నారు.

Also Read : సంక్షేమానికి కొత్త నిర్వచనం ఎన్టీఆర్..!

వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడితే స్వీప్‌ చేస్తామన్నారు. టీడీపీకి ఘనవిజయం అందించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికల్లో 57 శాతం ఓట్లు సాధించామని.. కార్యకర్తల పోరాటాలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని కొనియాడారు. దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నామన్నారు. టీడీపీ పని అయిపోయిందని చెప్పిన పార్టీలు.. అడ్రస్‌ లేకుండా పోయాయన్నారు. నా పాదయాత్ర నుంచి లోకేష్‌ యువగళం వరకు అదే ఉత్సాహం చూపించారని అభినందించారు.

Also Read : టీడీపీ ఫ్యూచర్ లీడర్ పై అధ్యక్షుని క్లారిటీ..!

గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను వేధించారని.. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నాను అన్నారు సిఎం. త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుందని స్పష్టం చేసారు. తెలుగు వారి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్‌ అన్నారు.

Also Read : కడప గడపలో కదం తొక్కిన పసుపు జెండా

పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం అందించామని.. రూ.2కి కిలో బియ్యం, సబ్సిడీ కరెంట్‌ టీడీపీ తెచ్చినవే అని.. అన్ని ప్రాంతాలు, అన్నివర్గాల అభివృద్ధికి టీడీపీ కృషి చేసిందని గుర్తు చేసారు. టీడీపీ కార్యకర్తలే నా ఆయుధాలు అన్నారు సిఎం. కార్యకర్తలతో కలిసి ఆకాశమేహద్దుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రం ఫస్ట్ అనేది టీడీపీ సంకల్పమని స్పష్టం చేసారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది టీడీపీనే అని.. ఏపార్టీ చూసినా టీడీపీ వర్సిటీలో చదివిన వాళ్లే ఉన్నారన్నారు. రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే అని గుర్తు చేసారు. మహానాడు-2025 చరిత్రలో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్