Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

పట్టువదలక సాధించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కు భారీగా కేంద్రం నిధులు కేటాయించడం పట్ల కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది. దాదాపుగా 8 ఏళ్ళ నుంచి రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందని మాట వాస్తవం. దీనిపై పెద్ద దుమారమే రేగింది. చంద్రబాబు సిఎం గా ఉన్నప్పుడు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఏం వచ్చిన పరిస్థితి లేదనే చెప్పాలి. ఎపీకి విభజన హామీలను ఏ విధంగా కూడా అమలు చేయకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈ తరుణంలో తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్రం భారీగా ఎపీకి నిధులు కేటాయించింది. బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి మరిన్ని అదనపు నిధులు అందజేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేసారు. ఇక పారిశ్రామిక రంగానికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని చెన్నై విశాఖ పారిశ్రామిక కారిడార్ ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ఇక కేంద్రం నిధులు కేటాయించడం పట్ల వైసీపీ అనుకూల మీడియా ఒక్కసారిగా షాక్ అయింది అనే చెప్పాలి. గత అయిదేళ్లుగా జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలని కోరడమే గాని ఏ రోజు కూడా నిధులు కేటాయించాలి అని అడిగింది లేదు. కనీసం బడ్జెట్ లో నిధులను కేటాయించకపోయినా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి లేదు. వ్యక్తిగత కేసుల మీదనే దృష్టి పెట్టిన అప్పటి ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అయినా కూడా వైసీపీ అనుకూల మీడియా మాత్రం ఫలప్రదం అంటూ జగన్ ఢిల్లీ పర్యటనలపై కామెంట్ లు చేసేది. కాని ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి భారీగా నిధులను సాధించడంతో వైసీపీ అనుకూల మీడియా కంగుతిన్నది అనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్