Friday, September 12, 2025 04:55 PM
Friday, September 12, 2025 04:55 PM
roots

మళ్ళీ ఢిల్లీకి బాబు.. ఏపీకి మోడీ

2024 లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ఢిల్లీ వెళ్ళిన సిఎం చంద్రబాబు నాయుడు.. మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సిఎం.. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు భవనాల శాఖా మంత్రి నితిన్ గడ్కారి, సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. విభజన హామీలపైనే ఎక్కువగా చంద్రబాబు ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : ఆ విషయంలో ఒంటరైన నాని..!

మరోసారి నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ సంస్థ కార్యాలయ శంకుస్థాపనకు మోడీని చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు కూడా ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రెండు నెలల కాలంలో ప్రధాని రెండు సార్లు రాష్ట్రానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. అమరావతి పనుల ప్రారంభం, యోగాంధ్ర కార్యక్రమానికి మోడీ వచ్చారు.

Also Read : తీన్మార్ రచ్చ.. కేసుల గోల..!

పలు దేశాల పర్యటనకు వెళ్ళిన మోడీ.. జులై 9 న దేశానికి తిరిగి వచ్చారు. అటు అమరావతికి కేంద్రం ఇచ్చిన గ్రాంట్ పై కూడా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పలు రాజకీయ పరమైన అంశాల్లో కూడా చర్చ జరిగే అవకాశం ఉండవచ్చు. తెలంగాణ రాజకీయాలపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి మళ్ళీ తెలంగాణాలో ఎన్డియే కూటమి పోటీ గురించి చర్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్