Sunday, March 22, 2026 05:52 PM
Sunday, March 22, 2026 05:52 PM

కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటుగా ఉన్న జిల్లాల పేర్లను మార్చే అవకాశం ఉందనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాతనే క్యాబినెట్ సబ్ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. తాజాగా దీనికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘంతో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.

Also Read : శుభకార్యాన్ని పక్కనపెట్టి.. లోకేష్, చంద్రబాబు పని తీరుపై ప్రశంసలు

ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులుగా ఉన్న అనగానీ, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తో పాటుగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజల అవసరాలు, పాలన సౌలభ్యం, అజెండాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై, ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ లోని మంత్రులతో చర్చించింది. గత ప్రభుత్వ హయాంలో ఆశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనపై చర్చించారు. గత ప్రభుత్వం నిర్ణయం కారణంగా పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తేయని, వాటిని సరిదిద్దే దిశగా జిల్లాల పునర్విభజన ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Also Read : నేనేంటో చూస్తారు.. మంత్రుల వద్ద చంద్రబాబు కామెంట్..?

అలాగే పరిపాలనలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడమే కాకుండా, జిల్లా కేంద్రాలను అవసరమైతే మార్చే దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు సూచించారు. జిల్లాల పునర్విభజనతో పాటుగా, అవసరమైతే కొత్త జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక తాజాగా జరిగిన సమావేశంలో కొత్త రెవెన్యూ డివిజన్ ల అంశంపై మంత్రుల అభిప్రాయాన్ని చంద్రబాబు అడిగారు. ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవడంతో పాటుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా చర్చించాలని సూచించారు సీఎం. అలాగే అమరావతి జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా పరిపాలన సౌలభ్యం కోసం.. కొత్త రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసే దిశగా మంత్రులు పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్