Wednesday, February 4, 2026 11:09 AM
Wednesday, February 4, 2026 11:09 AM

ఆలోచనతో రండి.. అవకాశాలు అందుకోండి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యుత్తు, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Also Read : పాక్ ఆదేశాలతోనే వాటర్ ట్యాంకుల్లో విషం.. హైదరాబాద్ ఉగ్రకోణంలో సంచలనం

సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల ఎంఓయూలు

పరిశ్రమలకు అనువైన వాతావరణం, పాలసీలు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం తగిన చేయూత అందిస్తుందని సీఎం అన్నారు. ఈ అంశంపై మాట్లాడుతూ.. “నేడు 99 కంపెనీల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. వీటి ద్వారా రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 2 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. జనవరికి మరో 70 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తాం.175 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి ప్రతీ కుటుంబంలోనూ ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారుచేస్తాం. భవిష్యత్ అంతా టెక్నాలజీదే. 14,15వ తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఈ ఒప్పందాల ద్వారా 8 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Also Read : పెద్దిరెడ్డి అక్రమాల వీడియోలు తీయించానన్న పవన్.. సూపరన్న చంద్రబాబు..!

గత ప్రభుత్వంలో పరిశ్రమలు మూతపడ్డాయి

గత పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని .. పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అంశంపై సీఎం మాట్లాడుతూ “చెత్త నుంచి సంపద సృష్టించడమే ఇప్పుడు కొత్త విధానం. కొత్తగా ఏర్పాటు అవుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు దీనిని అందిపుచ్చుకోవటం సంతోషదాయకం. దీనిద్వారా రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగాలు ఇవ్వటం కాదు… పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్పి ఇప్పుడు దానిని నిరూపిస్తున్నాం. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రంలో 17 నెలల క్రితం పాలనా పగ్గాలు చేపట్టాం. ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నాం’ అని సీఎం వివరించారు. గత పాలకులు పీపీఏలు రద్దు చేశారు. కరెంటు వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించారు. ఆ నిధులు వృధా కాకుండా ఉండి ఉంటే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టుకునే వాళ్లం. అన్ని విధాలుగా గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. విశాఖకు లక్ష కోట్ల పెట్టుబడితో గూగుల్ కంపెనీ వస్తోంది. ఇదీ కూటమి ప్రభుత్వంపై కంపెనీలకు ఉన్న విశ్వాసం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్