Saturday, September 13, 2025 12:37 PM
Saturday, September 13, 2025 12:37 PM
roots

సస్పెండ్ కాదు..వాళ్ళందరూ అరెస్ట్ ఖాయం

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో కొందరు అధికారులు రాజకీయ నాయకులను మించి రాజ్యంలో ప్రభావం చూపించారు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుడి ఎడమ భుజాలు చెప్పినట్టుగా చేసి, వాళ్ళ కోపాన్ని వీళ్ళు తీసుకుని కొందరు రాజకీయ నాయకులను సామాన్యులను అన్ని విధాలుగా వేధించడం మొదలుపెట్టారు. ఎక్కడో ముంబైలో ఉండే సినిమా నటిని కూడా వేధించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపిఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇలా దాదాపు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు చాలా వరకు జగన్ కు సేవ చేసారు.

ఇప్పుడు వాళ్లకు రంగం సిద్దమవుతోంది. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న కూటమి సర్కార్ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. ఎవడితో అయినా పెట్టుకో రాజకీయ నాయకుడితో కాదు అంటూ ప్రూవ్ చేస్తోంది. తప్పుడు కేసులు కాకుండా పక్కా సాక్ష్యాలతో ఉచ్చు బిగించడం మొదలుపెట్టింది కూటమి సర్కార్. హీరోయిన్ కేసులో ముగ్గురు ఐపిఎస్ అధికారులు సహా పలువురు అధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రఘురామా కృష్ణం రాజుని వేధించిన కేసులో అధికారులకు ఉచ్చు బిగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

Read Also : తొలి విడత నామినేటెడ్ పదవులు ప్రకటించిన చంద్రబాబు

కస్టడిలో రఘురామ కృష్ణం రాజుని వేధించిన విజయ్ పాల్ విషయంలో హైకోర్ట్ ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీనితో ఆయనను అరెస్ట్ చేయడం ఖాయంగా కనపడుతోంది. ఇక హీరోయిన్ కేసులో కాంతి రానా తాతాను కూడా అరెస్ట్ చేయడం ఖాయంగా కనపడుతోంది. అటు పీవీ సునీల్ కుమార్ కి కూడా ఉచ్చు బిగిస్తున్నారు అధికారులు. త్వరలోనే పీవీ సునీల్ కుమార్ ను అరెస్ట్ చేయవచ్చనే కథనాలు వస్తున్నాయి. రఘురామ కేసులో కొందరు ఎస్సైలు సిఐల మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఐపిఎస్ అధికారులను అరెస్ట్ చేయవచ్చు అనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్ట్ ల చుట్టు తిరుగుతున్నారు అధికారులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

పోల్స్