Tuesday, October 28, 2025 01:42 AM
Tuesday, October 28, 2025 01:42 AM
roots

అమరావతి అన్ స్టాపబుల్.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అమరావతిలో విట్ కాలేజీలో మాట్లాడిన చంద్రబాబు… చాలా రోజుల తర్వాత వండర్ ఫుల్ మీటింగ్.. జరిగిందని హర్షం వ్యక్తంచేశారు. విశ్వనాధన్ 20 ఏళ్ళ పాటు పార్లమెంటు లో ఉన్నారని 170 మంది తో విట్ ను వెల్లూరు లో ప్రారంభించారన్నారు. 2014 లో మీరు గెలిస్తే రాజధానిలో విట్ ఏర్పాటు చేస్తామని విశ్వనాథo అన్నారని, అన్నట్లే అమరావతిలో విట్ ఏర్పాటు చేశారు గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో కోoడలు, గుటల్లో భవిష్యత్ ను చూసిన పార్టీ టీడీపీ.. భవిష్యత్ ఐటీ అని చెప్పి ఐటీ నీ అభివృధి చేశామన్నారు.

Also Read : అడ్డంగా దొరికిన సజ్జల, రిపోర్ట్ రెడీ

మే 2 అమరావతి పునర్ ప్రారంభం కి ప్రధాని వస్తారు… మీరందరూ ప్రధాని సభకు రావాలని కోరారు. అమరావతి త్వరలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.అమరావతి విట్ లో 95 శాతం ప్లేస్ మెంట్స్ వస్తున్నాయి .. ఉద్యోగాలతో సంతృప్తి చెందవద్దు.. మీరే ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు ఎదగాలని పిలుపునిచ్చారు. అమరావతి తో పాటు రాష్ట్రం లో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1000 సేవలు అందిస్తున్నామని తెలిపారు. కశ్మీర్ లో టెర్రరిస్ట్ దాడులు ఖండించిన సీఎం చంద్రబాబు.. దేశం శక్తి ముందు టెర్రిస్టులు మటాష్ అవుతారన్నారు.

Also Read : సాక్షిపై సాయిరెడ్డి యుద్ధం..!

ఇక అమరావతి అభివృధి ఆన్ స్టాపబుల్ అన్నారు సీఎం. వైజాగ్ లో గూగుల్ సెంటర్ వస్తుంది.. కొత్త ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి కానుంది… ప్రధాని నేతృత్వంలో మెకిన్ ఇండియా ముందుకు వెళ్తున్నాం.. దేశం లోనే కర్నూల్ లో డ్రోన్ సిటీ నిర్మాణం చేస్తున్నాం.. సాటిలైట్ కూడా ఇక్కడ నుండి పంపే ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థుల సాంకేతికత ను అందిపుచ్చుకోండని సూచించారు. దేశం అభివృధి లో సాంకేతికత కీలకమన్నారు. 29 వేల మంది రైతులు అమరావతి కి భూములు ఇచ్చారని.. వాళ్లలో కొందరిని దత్తత తీసుకోమని కోరుతున్నానని పిలుపునిచ్చారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారన్నారు. విద్యార్థుల తెలుగుదేశం జెండా తీసుకు వచ్చారని.. విద్యార్థులకు రాజకీయాలు అవసరమన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్