Wednesday, February 4, 2026 07:15 PM
Wednesday, February 4, 2026 07:15 PM

శుభకార్యాన్ని పక్కనపెట్టి.. లోకేష్, చంద్రబాబు పని తీరుపై ప్రశంసలు

మోంథా తుఫాను తీవ్రతకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వణికి పోతుంది. ఎప్పుడు ఏ ప్రళయం ముంచుకొస్తుందా అనే ఆందోళనలో తీర ప్రాంత ప్రజలు గడుపుతున్నారు. ఇప్పటివరకు తుఫాను ప్రభావం అంతగా చూపకపోయినా క్రమంగా.. తీరం దాటే సమయానికి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది అనే హెచ్చరికలు వస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు కాసేపటికి క్రితం ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారినట్లు ప్రకటించారు. ఇక తుఫాను తీవ్రత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు.

Also Read : అలాంటి వారితోనే టీడీపీకి ప్రమాదం..!

విపత్తు సమయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇంట్లో నారా రోహిత్ వివాహం ఉన్నా సరే చంద్రబాబు, లోకేష్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థం అవుతుంది. దీనితో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని నారా లోకేష్ ఆదేశించారు. ఏ కార్యక్రమాలు ఉన్నా సరే రద్దు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

Also Read : చావులోను ఆగని విష ప్రచారం.. కులాలను లాగుతోన్న వైసీపీ

అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు లోకేష్. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్ననెన్స్ లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉమ్మడి విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, గుంటూరు జిల్లాల అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రజా ప్రతినిధులు కూడా తమ కార్యాలయాల్లో ఉండి అవసరం అయితే క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు అండగా ఉండాలని స్పష్టం చేశారు. బలమైన గాలులకు విద్యుత్ వైర్లు తెగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు లోకేష్. కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇబ్బంది రాకుండా సెల్ఫోన్ టవర్లు, చెరువుగట్లు తెగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఏది ఎలా ఉన్నా కుటుంబంలో శుభకార్యాన్ని పక్కనపెట్టి.. చంద్రబాబు, లోకేష్ విపత్తు సమయంలో అందుబాటులో ఉండటంపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్