Sunday, March 22, 2026 08:49 AM
Sunday, March 22, 2026 08:49 AM

ఏపీ జనసేన చీఫ్ గా ఎంపీకి ఛాన్స్..? పవన్ కీలక నిర్ణయం..?

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్నారా..? ఇప్పటివరకు పార్టీని చూసి చూడనట్లు వదిలేసిన పవన్ కళ్యాణ్.. ఇకనుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి.. నేతలను పరుగులు పెట్టిస్తారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2014 ఎన్నికలకు ముందు పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత పెద్దగా పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టలేదు. పార్టీకి అభిమానులే గాని కార్యకర్తల బలం తక్కువగా ఉండేది. 2019 ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కువగా పార్టీపై పడింది. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆ పార్టీలో ప్రజాధరణ ఉన్న నాయకుడిగా కనిపించారు.

Also Read : హిడ్మాకు సోషల్ మీడియాలో షాకింగ్ క్రేజ్.. వైరల్ అవుతోన్న తల్లి దీన స్థితి..!

అయితే తెలుగుదేశం పార్టీతో పోత్తు పెట్టుకుని 2024లో జనసేన పార్టీ అధికారం పంచుకుంది. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం పై పెద్దగా దృష్టి సారించ లేదు. దీనిపై జనసేన పార్టీ కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతునే ఉన్నారు. అయితే ఇప్పుడు పార్టీ కమిటీల నిర్మాణంతో పాటుగా, పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం, జిల్లా అధ్యక్షుల పదవుల నియామకాలను పూర్తిచేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కమిటీ వేసి.. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన నాయకులను గుర్తించనున్నారు. సామాజిక వర్గాల విషయంలో ఎక్కడ విమర్శలు రాకుండా ఉండేవిధంగా పవన్ అడుగులు వేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Also Read : అమ్మో ఉప ఎన్నిక.. ఖర్చు దెబ్బకు వణుకుతున్న రాజకీయ పార్టీలు..!

ఆరుగురు ఎమ్మెల్యేలతో కమిటీని, పవన్ కళ్యాణ్ వేసే అవకాశం ఉంది. దీనికి కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ నాయకత్వం వహించనున్నారు. 2029 ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లో పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా పార్టీ బలోపేతం జరగాల్సి ఉంది. అలాగే పార్టీలో చేరికల విషయంలో కూడా ఇక నుంచి దూకుడుగానే వ్యవహరించాలని.. పవన్ భావిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం అవసరం అయితే బహిరంగ సభలు కూడా నిర్వహించే దిశగా పవన్ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఇన్చార్జి నియామకాన్ని కూడా త్వరలోనే పూర్తిచేయనున్నారు. త్వరలోనే పార్టీ సమావేశాన్ని నిర్వహించి, కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కాకినాడ ఎంపీకి బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్