ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఏమో గాని కొన్ని కొన్ని వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. కొంతమంది వ్యవహరిస్తున్న శైలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చికాకు పెడుతోంది. ముఖ్యంగా మంత్రుల వద్ద ఉండే సిబ్బంది తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు వద్ద ఉంటున్న సిబ్బందిపై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. కొన్నాళ్ల క్రితం ఏపీ హోం మంత్రి అనిత పిఏ జగదీష్ ను స్వయంగా అనిత పక్కన పెట్టారు. ఆ తర్వాత మరి కొంత మందిపై కూడా ఇదే తరహాలో ఆరోపణలు వచ్చాయి.
Also Read : డ్రామా బయటపడుతుందని వైసీపీ భయపడుతోందా..?
సచివాలయంలో ఉన్న మంత్రుల పేషి ల్లో సిబ్బందిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక మంత్రుల ఇళ్ల వద్ద ఉన్న కోటరీ మంత్రుల పరువు తీస్తోంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఎవరైనా మంత్రిగారిని కలవాలి అంటే ఆ కోటరీ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా కోటరీ తల దూర్చడంపై విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగుల ట్రాన్స్ఫర్ ల నుంచి కొన్ని కీలక వ్యవహారాల్లో సదరు కోటరి వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు ఉన్నాయి.
Also Read : ఎంపీకి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ముగ్గురు నలుగురు కీలక మంత్రుల వద్ద ఉన్న కోటరీ అటు మంత్రుల వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపిస్తోంది. నియోజకవర్గాల్లో సైతం వీరి ప్రభావం ఎక్కువగా ఉండటంతో కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ గుంటూరులో నివాసం ఉంటున్న కొంతమంది మంత్రుల వద్ద వ్యక్తిగత పీఏలు అలాగే ఎన్నికల్లో వారికి సహకరించిన కొంతమంది మండల స్థాయి నాయకులు కూడా మంత్రుల నివాసాల వద్ద హడావిడి చేస్తున్నారు. అధికారిక నివాసాల వద్ద వారి హడావుడి చూసి కార్యకర్తలు సైతం చికాకు పడే పరిస్థితి ఏర్పడింది. దీనిపై మంత్రులు జాగ్రత్త పడకపోతే మాత్రం అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే ఉంటుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

