Tuesday, March 24, 2026 11:20 AM
Tuesday, March 24, 2026 11:20 AM

దానంపైనే బీఆర్ఎస్ గురి..? ఎందుకీ రివేంజ్..?

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలు చాలామందే ఉన్నా, బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేయడం వెనుక బీఆర్ఎస్ లీగల్ టీమ్ అందించిన పక్కా ఆధారాలే కీలకమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు దానంపైనే గులాబీ బాస్ ఇంతలా పగబట్టడానికి కారణం ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన దానంకు బీఆర్ఎస్ మంచి ప్రాధాన్యత ఇచ్చింది.

Also Read : తిరుమల పర్యటనపై రాజకీయాలు.. మీరు మారరా..?

ఖైరతాబాద్ వంటి కీలక స్థానంలో ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. అయితే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, లోక్‌సభ ఎన్నికల ముందే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం కేసీఆర్ కు తీవ్ర ఆగ్రహం కలిగించినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. మిగతా ఎమ్మెల్యేలు కేవలం కాంగ్రెస్ కండువా కప్పుకుని మద్దతు ఇస్తున్నామని చెబుతుంటే, దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఇది ఆయన పార్టీ మారారని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యం. ఈ పాయింట్‌ ను వదిలిపెట్టకూడదని బీఆర్ఎస్ పట్టుబట్టింది.

అందుకే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో గట్టిగా వాదిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంపై బీఆర్ఎస్‌ కు పట్టు ఉంది. దానంను అనర్హుడిగా ప్రకటింపజేసి, అక్కడ ఉపఎన్నిక వచ్చేలా చేస్తే, మళ్ళీ ఆ సీటును కైవసం చేసుకోవచ్చని గులాబీ పార్టీ వ్యూహం. దానంను రాజకీయంగా దెబ్బతీయడం ద్వారా మిగతా ఫిరాయింపు నేతలకు ఒక గట్టి హెచ్చరిక పంపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పిటిషన్ వేసింది బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అయినప్పటికీ, లోతుగా పరిశీలిస్తే దీని వెనుక బీఆర్ఎస్ వ్యూహకర్తల హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి.

Also Read : ఏపీలో ఏనుగు దంతాల స్మగ్లింగ్ కలకలం..!

కాంగ్రెస్ బలాన్ని తగ్గించడానికి, ఫిరాయింపుల చట్టాన్ని అస్త్రంగా వాడుకోవడంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒకే తాటిపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. వచ్చే నెల 16న హైకోర్టులో జరిగే విచారణ దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ కోర్టు గనుక సీరియస్ అయితే, దానం ఎమ్మెల్యే పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ పట్టుదల చూస్తుంటే, దానంను ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదనే కామెంట్స్ వస్తున్నాయి. కడియం శ్రీహరి కంటే దానంపైనే అధిష్టానం ఇంతలా ఫోకస్ చేయడం కాంగ్రెస్ లో కూడా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతికి ఎన్నో ప్రత్యేకతలు..!

హైదరాబాద్‌ను అధిగమించేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని...

శ్రీశైలం డ్యామ్ పునాదులు...

రెండు తెలుగు రాష్ట్రాల సాగు, జల...

కావలి టీడీపీలో గ్రూపు...

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం...

జగన్‌తో ఒంటరి పోరాటం...

ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే...

ఏపీలో ఏనుగు దంతాల...

వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు...

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

పోల్స్