Sunday, March 22, 2026 03:22 AM
Sunday, March 22, 2026 03:22 AM

మా ఓటమికి ఆమే కారణం..!

ఎన్నికల్లో గెలుపు ఓటములకు చాలా కారణాలుంటాయి. వాటిల్లో ఒకటి మాత్రం బాగా పాపులర్ అవుతుంది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఐదేళ్ల జగన్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అనేది ప్రధాన అంశం. అదే సమయంలో సొంత తల్లి, చెల్లిని కూడా ఆస్తి కోసం జగన్ పక్కన పెట్టారనే మాట ప్రజల్లోకి బాగా వెళ్లింది. అటు చెల్లి షర్మిల కూడా ఎన్నికల్లో కొంగు చాచి అడుగుతున్నా అంటూ చేసిన ప్రచారం వైసీపీ పట్ల మహిళల్లో వ్యతిరేకానికి కారణమైంది. దీని వల్ల కూడా వైసీపీ ఘోర పరాజయం పాలైందనేది.

Also Read : అమెరికన్లకు ఉద్యోగాలు లేకపోతే చూస్తూ ఎలా ఊరుకుంటాం..?

అటు తెలంగాణలో కూడా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓటమికి ఇంటి ఆడపడుచే కారణమంటున్నారు సొంత పార్టీ నేతలు. ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన సమయంలో కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత గురించే ప్రశ్నించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమెను అంతా లిక్కర్ రాణి అంటున్నారన్నారు. అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారని కవితపై ఆరోపణలు చేశారు. తనపై కవిత చేసిన ఆరోపణలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని నిరంజన్ రెడ్డి తెలిపారు.

Also Read : మద్యం కేసులో పీకల్లోతు ఇరుకున్న పెద్దన్న..!

తెలంగాణ జాగృతి చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత వనపర్తిలో పర్యటించారు. ఆ సమయంలో నిరంజన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో దేవుడి భూములను నిరంజన్ రెడ్డి కబ్జా చేశారని.. వాటి రికార్డులు బయటకు రాకుండా తహశీల్దార్ కార్యాలయాన్ని తగలబెట్టిన విషయం పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంజన్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు కాపాడుతున్నారన్నారు. నిరంజన్ రెడ్డి వల్లే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందన్నారు కవిత. అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా నిరంజన్ రెడ్డి అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్‌లో చాలా మంది అవినీతిపరులున్నారని… అందరి జాతకం బయటపెడతా అని వార్నింగ్ కూడా ఇచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్