Sunday, March 22, 2026 05:37 PM
Sunday, March 22, 2026 05:37 PM

వైజయంతి మూవీస్ పై బాలీవుడ్ ఫ్యాన్స్ ఏడుపులు.. ఎందుకీ ఫేక్ ప్రచారం..?

గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్, వైజయంతి మూవీస్ వర్సెస్ బాలీవుడ్ మీడియాగా వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై ఓ రేంజ్ లో రచ్చ నడుస్తోంది. గత ఏడాది రిలీజ్ అయిన కల్కీ సినిమా సూపర్ హిట్ కాగా.. పార్ట్ 2 లో దీపికను రెమ్యునరేషన్ దెబ్బకు పక్కన పెట్టింది వైజయంతి మూవీస్. ఇక తాజాగా బాలీవుడ్ ఫ్యాన్స్ ఓ విషయంలో హడావుడి మొదలుపెట్టారు. సినిమా చివరన వచ్చే క్రెడిట్స్ లో దీపిక పేరు తొలగించారు అని విమర్శించారు. దీపికపై కక్ష సాధింపుగా వ్యవహరించారని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Also Read : సూపర్.. దుమ్ము రేపారు.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్..!

కల్కి పార్ట్ 2 నుండి ఆమెను, తొలగించిన తర్వాత, నిర్మాతలు.. ఇప్పుడు నెట్‌ ఫ్లిక్స్‌ లో సినిమా ఎండ్ క్రెడిట్స్ నుండి దీపిక పేరును తొలగించారని.. దీపిక పేరు లేకుండా స్క్రీన్‌ షాట్‌ లు వైరల్ అయ్యాయి. దీపిక అభిమానులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభాస్ ను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అయితే స్క్రీన్‌ షాట్‌ లు, స్క్రీన్ రికార్డింగ్‌ లలో.. ఆమె పేరు ఎండ్ క్రెడిట్స్‌లో లేదు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ లో ప్రసారం అవుతోంది. దీనితో దీపికను అవమానిస్తున్నారని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Also Read : కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

ఈ హడావుడి చూసి జాతీయ మీడియా కూడా దీనిపై ఆరా తీసింది. రెండు వెర్షన్లను (ప్రైమ్, నెట్‌ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ) బ్రౌజ్ చేసి పరిశీలించింది. కానీ టైటిల్ ప్లేట్ తో పాటుగా ఎండ్ క్రెడిట్ లో కూడా దీపిక పేరు ఉంది. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కావాలనే టాలీవుడ్ ను టార్గెట్ చేసేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారని, ప్రభాస్ ను చూసి బాలీవుడ్ ఫ్యాన్స్ లో భయం మొదలైందని కౌంటర్ లు ఇస్తున్నారు. నిర్మాతలను టార్గెట్ చేయడానికే ఓ వర్గం ఈ డ్రామాలు ఆడుతుందని ఫైర్ అయ్యారు. కాగా ఈ సినిమా పార్ట్ 2 2027 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్