Monday, October 27, 2025 10:41 PM
Monday, October 27, 2025 10:41 PM
roots

పుష్ప తో బ్లూ మీడియా కాళ్ళ బేరమా?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీకి అత్యంత దారుణమైన గడ్డు పరిస్థితి ఉందనే మాట నిజం. వైసీపీ ఓటమి తర్వాత చాలా మంది ఆ పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచనలో పడ్డారు. జగన్ విధానాలు చూసి కూడా కొందరు సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఈ తరుణంలో కొన్ని వర్గాలను దగ్గర చేసుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. బ్లూ మీడియా ద్వారా కొందరికి గాలం వేసే ప్రయత్నాలు తీవ్రంగా చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వైసీపీ… అల్లు అర్జున్ ను భుజాన వేసుకునే కార్యక్రమం మొదలుపెట్టింది.

Also Read : కొత్త పెన్షన్ల అర్హతలు… కావాల్సిన పత్రాలు ఇవే

పుష్ప సినిమాను కర్ణాటకలో వైసీపీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో లేపుతుంది. అలాగే సాక్షి ఛానల్ లో కూడా బన్నీ గురించి ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టారు. సినిమాకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని… బన్నీ ఒంటరి అయ్యాడు అనే చెప్పే ప్రయత్నం బ్లూ మీడియా చేస్తోంది. దీని ద్వారా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు దగ్గర కావాలని చూస్తోంది. మెగా ఫ్యామిలీతో బన్నీకి గ్యాప్ ఉన్న మాట నిజం. ఇప్పుడు ఆ గ్యాప్ ను పెంచే విధంగా వైసీపీ సోషల్ మీడియా ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టింది. లేని సమస్యలను కూడా సృష్టిస్తోంది.

Also Read : వైఎస్ సునీత మనసులో ఏముంది?

జగన్ సిద్దం సభలతో, జగన్ పాదయాత్ర సమయంలో నిర్వహించిన బహిరంగ సభలతో పుష్ప ఈవెంట్ ను పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు స్టేట్స్ లో ఇద్దరే హీరోలు అని ఒకరు పొలిటికల్ హీరో జగన్ అయితే రెండు అల్లు అర్జున్ అంటూ పుష్ప సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే టికెట్స్ కొని బన్నీ ఫ్యాన్స్ కు పంచడానికి కూడా రెడీ అవుతున్నారు వైసీపీ నేతలు. రాయలసీమలో ఈ సీన్ జరిగే ఛాన్స్ ఎక్కువగా కనపడుతోంది. మరి ఫ్యూచర్ లో ఏ పరిణామాలు ఉంటాయో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్