వైసీపీ ప్రభుత్వంలో పదవి కావాలంటే… వారికి ఉండాల్సిన ఒకే ఒక్క అర్హత చంద్రబాబును తిట్టడం. ఎన్ని తిట్లు తిడితే… అంత పెద్ద పదవి. దూషించిన వారికి, దాడి చేసిన వారికి మాత్రమే పదవులు వస్తాయి. ఇలా పదవులు పొందిన వారిలో జోగి రమేష్, రోజా, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంటుంది. ప్రభుత్వ కార్యాక్రమాల్లో, బహిరంగ వేదికలపై కూడా నాటి ప్రతిపక్ష నేతలను నోటికి వచ్చినట్లు ఎవరైతే దూషించారో.. వారికే పదవులు. అలాంటి వారిపై ఎలాంటి కేసులు కూడా లేవు. దీంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌తో పాటు టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. కొన్ని సార్లు దాడులకు కూడా తెగబడ్డారు.
Also Read : చంద్రయ్య కేసు సిఐడీకి.. న్యాయం జరుగుతుందా..?
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై రాళ్లతో దాడికి యత్నించారు. యర్రగొండపాలెంలో చంద్రబాబుపై రాళ్లతో దాడి చేశారు. లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకు తూర్పు గోదావరి జిల్లాలో అడ్డంకులు సృష్టించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో పవన్‌ను మంత్రి రోజా అసభ్యకరంగా మిడిల్ ఫింగర్ చూపించి హేళన చేశారు. అదే సమయంలో నాడు టీడీపీ నేతలను దూషించిన వారికే ఇప్పుడు బీజేపీ కూడా పదవులిస్తోంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజుకు తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్ఠానం. దీనిపై తెలుగు తమ్ముళ్లు కాస్త గుర్రుగా ఉన్నారు. తెలుుగుదేశం, బీజేపీ పొత్తులో భాగంగా 2017లోనే సోము వీర్రాజుకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు చంద్రబాబు సహకరించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ నుంచి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు… అధికారంలో ఉన్న వైసీపీ కంటే కూడా… ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పైనే ఎక్కువగా విమర్శలు చేశారు.
Also Read : బోరుగడ్డ వస్తాడా…? పోలీసుల్లో పెరుగుతోన్న ఉత్కంట
ఏ చిన్న విషయం అయినా సరే… ఇదంతా చంద్రబాబు చేసిన తప్పు వల్లే.. అంటూ ఆరోపించారు. చివరికి చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా కనీసం దానిని ఖండించలేదు. పైగా అధ్యక్ష పదవిని పురంధేశ్వరికి కేటాయించడాన్ని జీర్ణించుకోలేక… ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అంటూ సన్నిహితుల దగ్గర వ్యాఖ్యలు కూడా చేశారు. అలాంటి సోము వీర్రాజుకు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇక వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ స్థానాన్ని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు కేటాయించినట్లు సమాచారం. జీవీఎల్ కూడా వైసీపీ కోవర్ట్ అని గతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.పలు బహిరంగ వేదికలపై జీవీఎల్ కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు.
Also Read: చంద్రబాబు సీఎం పదవి.. పవన్ పుణ్యమే..!
అటు రాజ్యసభలో కూడా టీడీపీ నేతలనే టార్గెట్ చేశారు తప్ప… వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. ఎన్నికల సమయంలో కూడా విశాఖ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన జీవీఎల్… ఆ స్థానాన్ని ఎంపీ శ్రీభరత్‌కు కేటాయించడంతో… విమర్శలు చేశారు. కుటుంబ పాలన అంటూ వ్యాఖ్యలు చేశారు. పైగా ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అటు జీవీఎల్, ఇటు సోము వీర్రాజు ఎలాంటి ప్రయత్నం చేయాలేదు. ప్రచారంలో పాల్గొనలేదు. మరి ఇలాంటి వారికి ఎలా పదవులు ఇచ్చారంటే… కేవలం ఒకే ఒక్క అర్హత అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏ పార్టీ అయినా సరే.. చంద్రబాబును తిడితే చాలు.. వాళ్లు హీరోలు అవుతారు… అలా దూషించిన వారికే పదవులు వస్తాయి. ఇదే వైసీపీ, బీజేపీ ఫార్ములా అంటున్నారు.