Sunday, March 22, 2026 09:28 AM
Sunday, March 22, 2026 09:28 AM

బర్డ్ ఫ్లూ రీ ఎంట్రీ..? కాని అక్కడే..!

బర్డ్ ఫ్లూ.. భారత పౌల్ట్రీ రంగాన్ని భయపెట్టిన ఏకైక వైరస్. రెండు దశాబ్దాల నుంచి ఈ మాట వింటే పౌల్ట్రీ రైతులు వణికిపోతున్నారు. పెంచిన కోళ్ళు కళ్ళ ముందే రాలిపోతుంటే ఏమీ చేయలేక, మార్కెట్ లో రేటు లేక.. ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ వైరస్ పంజా విప్పే సంకేతాలు కనపడుతున్నాయి. కేరళలోని అలప్పుజ, కొట్టాయం వంటి కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ ఫ్లు ఎంజా) కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల కారణంగా తమిళనాడులోని అధికారులు ఈ వ్యాధి రాష్ట్రంలోకి వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

Also Read : తప్పుడు అప్పుల లెక్కలతో జగన్ నాటకాలు

సరిహద్దు జిల్లాల వెంట నిఘాను ముమ్మరం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కేరళ నుండి జిల్లాకు కోళ్లు, గుడ్లు, కోళ్ల వ్యర్థాలు, ఇతర సంబంధిత ఉత్పత్తులను రవాణా చేయడాన్ని తాత్కాలికంగా నిషేధించినట్లు నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య తెలిపారు. అంతకుముందు, దేశంలోనే అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రాలలో ఒకటైన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్‌లు ఈ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి బయోసెక్యూరిటీ, నిఘాను ముమ్మరం చేశాయి. నామక్కల్ లో దాదాపు 1,500 పౌల్ట్రీ ఫామ్‌ లు ఉన్నాయి.

Also Read : బీసీ నేతకు షాక్ ఇచ్చింది బీసీ ఓటర్లే నా!!

ఇక్కడి నుంచి ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా కోడి గుడ్లు సరఫరా అవుతాయి. బర్డ్ ఫ్లూ కోళ్లు, బాతులు, టర్కీలు వంటి దేశీయ కోళ్ళను మాత్రమే కాకుండా అడవి, వలస పక్షుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో, మానవులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2003 నుండి ఆగస్టు 2025 వరకు, 25 దేశాలలో 990 మానవ బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించింది. ఇందులో 475 మరణాలు కూడా ఉన్నాయి. అయితే ఇది అరుదైన సందర్భాల్లో మాత్రమే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్