Sunday, March 22, 2026 10:09 AM
Sunday, March 22, 2026 10:09 AM

అసెంబ్లీలో కూడా అలా చేస్తారా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పూర్తి ఏకపక్షంగా జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికైన సభ్యులు సభకు రాకపోవటమే. నిజానికి గతంలో శాసనసభ సమావేశాలు అంటే వాడీ వేడీగా జరిగేవి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం, ప్రశ్నలు, జవాబులు, లెక్కల వివరాలు, ప్రభుత్వం చేస్తున్న పనుల గొప్పలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేసిన తప్పులు.. వాటి వివరణలు, వాకౌట్‌లు.. ఇలా అసెంబ్లీ సమావేశాలు సాగాయి. ఇంకా చెప్పాలంటే సమావేశాలు ఎప్పుడు జరుగుతాయా అని ప్రజలు ఎదురు చూసే వాళ్లు. అటు ప్రధాన పార్టీల సభ్యులు కూడా సభకు వస్తే అన్ని తేల్చుకుందామని సవాల్ కూడా విసురుతారు.

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్షమే అవసరం లేదన్న జగన్.. ఇప్పుడు అదే ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత 18 నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటి సారి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే… రెండో సారి మాత్రం.. గత బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం రోజున సభకు వచ్చి.. సరిగ్గా 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి.. వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ ముఖం చూడలేదు. పైగా తనకు కూడా ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : టీడీపీపై మోదీ సవతి ప్రేమ..?

అసెంబ్లీకి వచ్చేందుకు జగన్‌కు ముఖం చెల్లడం లేదని తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఏదైనా అవినీతి ఆరోపణలు చేస్తే.. సభకు వస్తే వివరణ ఇస్తామని సవాల్ కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సభకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు తీసుకునే హక్కు లేదని.. అలాగే 60 రోజుల పాటు సభకు రాని సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తున్నారో.. అలాగే ఎమ్మెల్యేలను కూడా తొలగించాలన్నారు అయ్యన్న పాత్రుడు. అదే సమయంలో కొందరు వైసీపీ నేతలు దొంగల్లా అసెంబ్లీ లాబీల్లో ఉన్న రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోతున్నారంటూ అయ్యన్న పాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినా సరే వైసీపీ నేతల్లో ఎలాంటి చలనం రాలేదు.

తాజాగా కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ్యులు హాజరు కోసం ఇకపై లాబీల్లో రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో లాబీల్లో సంతకం చేసి వెళ్లిపోతే.. అది సభకు హాజరైనట్లు కాదన్నారు. సభ్యులెవరైనా సరే.. ఇకపై సభలో తమకు కేటాయించిన సీటులో కూర్చున్న తర్వాత.. వారి స్థానం దగ్గరికే లోక్‌సభ సిబ్బంది వచ్చి సంతకంతో పాటు బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారని ఓమ్ ప్రకాష్ బిర్లా స్పష్టం చేశారు. దీని వల్ల లాబీల్లో రద్దీ తగ్గుతుందని.. అలాగే సభకు రాకుండా సంతకం చేసి వెళ్లడం సాధ్యం కాదన్నారు.

Also Read : అమరావతిపై కేంద్ర కేబినెట్ కీలక అడుగులు..!

లోక్‌సభలో తీసుకున్న చర్యలను ఏపీ అసెంబ్లీలో కూడా అమలు చేయాలనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఇలా చేస్తే అసెంబ్లీ లాబీల్లో సంతకం చేసి వెళ్లిపోవడం ఇకపై సాధ్యం కాదు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు సంతకం ద్వారా సభకు హాజరైనట్లు గుర్తించి.. జీతభత్యాలు చెల్లిస్తున్నారు. దీంతో సగం మంది సభ్యులు సభలోకి రాకుండానే బయటే సంతకం చేసి వెళ్లిపోతున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే.. అసెంబ్లీలో కూడా స్మార్ట్ కార్డ్, బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్