Saturday, October 25, 2025 11:40 AM
Saturday, October 25, 2025 11:40 AM
roots

బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ – కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్!

ఇంకా కొన్ని గంటల్లోనే స్టార్ మా ఛానల్‌లో బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈసారి షోపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు గత సీజన్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అందుకే బిగ్ బాస్ టీమ్ కూడా భారీ స్థాయిలో ప్లానింగ్ చేసింది. కంటెస్టెంట్స్ పేర్లు రహస్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ, లాంచ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయ్యాక లిస్ట్ బయటకు వచ్చేసింది.

ప్రతి సీజన్‌కి రివ్యూలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిరెడ్డి ఈ సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్‌ను లీక్ చేశాడు. సీజన్ 6లో టాప్ 5లో నిలిచిన ఆయన చెప్పిన లిస్ట్ ప్రకారం హౌస్‌లో అడుగుపెట్టిన వారు ఇలా ఉన్నారు.

Also Read : ఆ విషయంలో టీడీపీ ఫెయిల్ అయినట్లే..!

ముందుగా రీతూ చౌదరి, తనూజ గౌడ, ఇమ్మానుయేల్ ఇప్పటికే హౌస్‌లోకి వెళ్లారని సమాచారం. వీళ్ళు ఇటీవలే స్టార్ మా ‘కూకూ విత్ జాతి రత్నాలు’ షోలో కనిపించారు. అక్కడే వీరి ఎంటర్టైన్మెంట్ రేంజ్ తెలిసింది. ముఖ్యంగా రీతూ చౌదరి కాంట్రవర్సీల వల్ల ఎంత హంగామా చేసిందో అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఆమె రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.

మిగిలిన వారిలో భరణి శంకర్, రాము రాథోడ్, సుమన్ శెట్టి ఉన్నారు. భరణి శంకర్ చాలా సీరియస్ వ్యక్తి అనిపిస్తున్నాడు. అతని వల్ల కూడా హౌస్‌లో చర్చలు, కాంట్రవర్సీలు జరిగే అవకాశముంది. రాము రాథోడ్, సుమన్ శెట్టి మాత్రం కాస్త సాఫ్ట్ కంటెస్టెంట్స్‌లా కనిపిస్తున్నారు.

Also Read : బ్రాండ్ బిల్డప్.. గ్రాండ్ ఈవెంట్..!

అలాగే ఆశా షైనీ, సంజన గల్రాని, శ్రేష్టి వర్మ కూడా లిస్ట్‌లో ఉన్నారు. వీరిలో శ్రేష్టి వర్మ గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు వేసి నాలుగు నెలల పాటు వార్తల్లో నిలిచింది. ఇప్పుడు హౌస్‌లో ఎలా ప్రవర్తిస్తుందో ఆసక్తిగా ఉంది. సంజన గల్రాని విషయానికి వస్తే, ఆమె కన్నడలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగి, అక్కడి బిగ్ బాస్‌లో కూడా పాల్గొంది. బలమైన కంటెస్టెంట్ అనే పేరుంది. ఆశా షైనీ మాత్రం సున్నితమైన కంటెస్టెంట్‌గా భావిస్తున్నారు.

ఇక అగ్నిపరీక్ష షో ద్వారా ఎంపికైన సామాన్యుల్లో మర్యాద మనీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజా, మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియా శెట్టి హౌస్‌లోకి వెళ్లారు. ఆదిరెడ్డి చెప్పిన లిస్ట్ ఇదే. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్