Monday, October 27, 2025 07:27 PM
Monday, October 27, 2025 07:27 PM
roots

అందరూ స్టార్లే.. అఖండ2 పై బోయపాటి బిగ్ స్కెచ్

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సీక్వెల్ షూటింగ్ 50% దాదాపుగా కంప్లీట్ అయింది. ఇక మిగిలిన షూటింగ్ ను త్వరలోనే కృష్ణాజిల్లాలో మొదలుపెట్టనున్నారు మేకర్స్. దీనిపై ఇప్పటికే వర్కౌట్ కూడా కంప్లీట్ చేశాడు డైరెక్టర్ బోయపాటి. ఇక ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ ను తీసుకునేందుకు బోయపాటి ఇంకా వర్కౌట్ చేస్తూనే ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాకు క్రేజ్ ఉండటంతో బోయపాటి జాగ్రత్త పడుతున్నాడు. అఖండ ఫస్ట్ పార్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read : వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో యుద్ద మేఘాలు

దీనితో ఈ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమాలో ఇప్పటికే ఐశ్వర్యరాయ్ తో పాటుగా తమిళ స్టార్ హీరో ఒకరు నటిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. ఇక లేటెస్ట్ గా ఆది పినిశెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా అనౌన్స్ చేసాడు. గత కొన్ని రోజులుగా దీనిపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఆది పినిశెట్టి దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.

Also Read : ప్రభాస్ రూట్ లోనే ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండుగే…!

తాను ఈ సినిమాలో నటిస్తున్నానని, ఇప్పటికే తన పోర్షన్ కు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిందని, త్వరలోనే మరో షెడ్యూల్ ఉండబోతుందంటూ అనౌన్స్ చేశాడు. చాన్నాళ్ల తర్వాత బాలకృష్ణతో కలిసి వర్క్ చేశానని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ కూడా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోగా.. త్వరలోనే కృష్ణాజిల్లాలోని గుడిమెట్ల గ్రామంలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. బాలకృష్ణ లేకుండానే కృష్ణా జిల్లాలో షూటింగ్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్