ఇంగ్లాండ్ పర్యటన లో జట్టులో జరిగిన కొన్ని మార్పులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధానంగా పేస్ బౌలింగ్ విషయంలో హెడ్ కోచ్ గంభీర్ అనుసరించిన వైఖరిపై జాతీయ మీడియా కూడా కథనాలు రాసింది. హర్షిత్ రానా విషయంలో సోషల్ మీడియాలో సైతం కోచ్ పై ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఏ తరుపున ఆడిన హర్షిత్ రానాను జట్టులో చేరమని గంభీర్ చెప్పడం వివాదాస్పదం అయింది. అన్షుల్ కాంబోజ్ మెరుగ్గా రాణించినా హర్షిత్ రానాను జట్టులోకి తీసుకున్నారు. అతనిని తొలి టెస్ట్ లో ఆడించే అవకాశం ఉందని భావించాయి క్రికెట్ వర్గాలు. కాని చోటు కల్పించలేదు.
Also Read : గంభీర్ ఎరా.. కోచ్ సాబ్ గ్రేటెస్ట్ పెర్ఫామెన్స్
ఇది క్రమంగా చినికి చినికి గాలి వానగా మారే అవకాశం ఉండటంతో జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో రెండో టెస్ట్ కోసం భారత జట్టు బర్మింగ్‌హామ్‌కు వెళ్లింది. ఈ సమయంలో లీడ్స్ నుంచే రాణా తిరిగి ఇండియా వెళ్తున్నాడని భారత జట్టు వర్గాలు వెల్లడించాయి. లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ కోసం రాణాను భారత జట్టులో చేర్చారు. బౌన్సీ పిచ్ లు కావడంతో రాణా అయితే బాగుంటుందని యాజమాన్యం భావించిందని.. కాని అతని విషయంలో విమర్శలు రావడంతోనే వెనక్కు పంపారని జాతీయ మీడియా వెల్లడించింది. గత సంవత్సరం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో ఆస్ట్రేలియా పర్యటనలో రాణా తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. అక్కడ 50.75 సగటుతో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
Also Read : స్టార్ క్రికెటర్ పెళ్ళి వాయిదాకు అదే కారణమా..?
కాంటర్‌బరీలో ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా ‘ఎ’ తరపున ఆడే అవకాశం రాణాకు లభించింది. కానీ 99 పరుగులిచ్చి కెలవం ఒకే ఒక్క వికెట్ తీయడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక రెండో టెస్ట్ కోసం భారత్ జట్టులో భారీ మార్పులు ఉండొచ్చని తెలుస్తుంది. జట్టులో కీలక ఆటగాడు అయిన బుమ్రా రెండు టెస్ట్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అతనితో పాటు మొదటి టెస్ట్ లో ఏమాత్రం ప్రభావం చూపని శార్దూల్ ఠాకూర్ ని కూడా పక్కన పెట్టబోతున్నారు. వీరి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

