Monday, October 27, 2025 10:33 PM
Monday, October 27, 2025 10:33 PM
roots

మంగళగిరిని షేక్ చేస్తున్న కార్ల స్కాం..!

మంగళగిరి పట్టణంలో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంగళగిరి లో నకిలీ బంగారం స్కాం మరువక ముందే కోట్ల రూపాయల కార్లు స్కాం బయటపడింది. బాధితులకు లగ్జరి కార్లు ఆశ చూపి భారీ మొత్తంలో నగదు స్వాహా చేసిన వ్యవహారం వెలుగులోకి రావడం ఆశ్చర్యపరుస్తోంది. కార్లు రికవరి అంటూ హైదరాబాద్ పోలీసులు ఎంట్రీ ఇవ్వడం.. కార్లు స్వాధీనం చేసుకున్న ఘటన ఇప్పుడు షేక్ చేస్తోంది. చుట్టుపక్కల వ్యాపారస్తులను టార్గెట్ చేసుకొని లగ్జరీ కార్లు తాకట్టు పెట్టి కోట్లు రూపాయలు వసూలు చేసింది ఓ ముఠా.

Also Read : గండికోటలో దారుణం.. మైనర్ బాలిక మృతి..!

పెద్ద మొత్తంలో కార్లు టెండర్ ద్వారా వచ్చాయి పేర్లు మారడానికి టైం పడుతుందంటూ నమ్మించి కార్లు తాకట్టు పెట్టి కారు కి ఐదు లక్షలు నుండి 10 లక్షలు వరకు వసూలు చేసారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ , ప్రాంతాల్లో సుమారు 200 నుండి 250 కార్లు వరకు తాకట్టు పేరుతో కోట్లు రూపాయలు వసూలు చేసారు. హైదరాబాద్ నుండి కార్లు కోసం పోలీస్ టీమ్ రెండు జిల్లాలో గాలిస్తూ తాకట్టు పెట్టుకున్న వారి వద్ద కార్లు రికవరీ పేరుతో స్వాధీనం చేసుకోవడంతో కంగుతిన్నారు.

Also Read : వర్షా కాలానికి జీర్ణ వ్యవస్థకు సంబంధం ఏంటీ..?

ఈ లగ్జరీ కార్లు తాకట్టు వ్యవహారంలో రెండు జిల్లాల పోలీస్ అధికారులు సైతం బాధితులుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో పెదకాకాని కి చెందిన వ్యక్తితో పాటు మంగళగిరి కి చెందిన కొందరు వ్యక్తులు సూత్రధాలుగా ఉన్నట్లు గుర్తించారు. డిపార్ట్మెంట్ లో అధికారులకు వారి కుటుంబ సభ్యుల అవసరాలకు కార్లు పంపుతూ వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు నిందితుల దగ్గరకు వెళ్ళకుండా తాకట్టు పెట్టుకున్న వారి దగ్గర నుంచి కార్లు స్వాధీనం చేసుకోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్