Sunday, March 22, 2026 05:04 AM
Sunday, March 22, 2026 05:04 AM

ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ఏంటీ..? ఎయిర్పోర్ట్ లో ఎలా ఉపయోగం..?

ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్.. ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతోన్న మాట. హీరోయిన్లు, హీరోలు.. ఇమ్మిగ్రేషన్ లో వేగంగా ముందుకు వెళ్లేందుకు ఈ పద్దతిని ఎక్కువగా వాడుతున్నారు. తాజాగా రాణీ ముఖర్జీ, సుష్మితా సేన్ వంటి వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ను ఎక్కువగా వాడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి అసలు ఈ ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ అంటే ఏంటీ..? బాలీవుడ్ నటులు ఎక్కువగా ఎందుకు వాడుతున్నారో చూద్దాం.

Also Read : నిజంగానే ఓటీటీలు అంత రేటు పెడుతున్నాయా..?

ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్స్ ప్రోగ్రామ్ అంతర్జాతీయ ప్రయాణాన్ని వేగవంతం, మరింత సౌకర్యవంతంగా చేయడానికి తీసుకొచ్చారు. రిజిస్టర్డ్ ప్రయాణీకులు ఇమ్మిగ్రేషన్ క్యూలలో నిలబడకుండా.. తక్కువ టైం లో ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయవచ్చు. 2024లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం కేవలం 30 సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. విమానాశ్రయాలలో వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది. తరుచుగా ప్రయాణాలు చేసే వారికి ఇది సౌకర్యవంతంగా ఉండనుంది.

Also Read : ఉగ్రవాదులపై పోరుకు మహిళలు.. ఇండియన్ ఆర్మీ సంచలనం

ప్రస్తుతం, ఈ విధానం భారత్ లోని 13 విమానాశ్రయాలలో పనిచేస్తోంది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, లక్నో, అమృత్‌సర్, కాలికట్, త్రివేండ్రం మరియు తిరుచ్చి విమానాశ్రయాల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మొదటి ఈ-గేట్ వద్ద మీ బోర్డింగ్ పాస్ మరియు పాస్‌పోర్ట్‌ను స్కాన్ చేయాలి. తర్వాతి గేటు వద్ద.. బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. గేటు ఆటో మేటిక్ గా ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్లిపోవచ్చు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్ పోర్ట్ కావాల్సి ఉంటుంది. భారత పౌరులు, భారతీయ పౌరులు, ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డులు కలిగి ఉన్న విదేశీయులకు ఇది వర్తిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్