Sunday, March 22, 2026 07:14 AM
Sunday, March 22, 2026 07:14 AM

అప్పుడు ఎక్కడ ఉన్నారు సార్..? రామచంద్ర యాదవ్ పై విమర్శలు

“సీపీఎస్ ర‌ద్దు చేయ‌క‌పోతే ఉద్య‌మం త‌ప్ప‌దు, ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగుల హ‌క్కుల‌కు భంగం, ఉద్యోగుల‌తో చాకిరీ, వేధింపులు, రెవెన్యూ, పోలీస్ అధికారుల‌ను పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మారుస్తున్నారు. ఏపీలో ప్ర‌భుత్వాలు మారినా.. నాయ‌కులు మారినా.. అధికారం మారుతున్నా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింది, ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఆర్థిక‌, ఉద్యోగ భ‌ద్ర‌తతో పాటు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్ భ‌ద్ర‌త ఉంటుంద‌న్న న‌మ్మ‌కం ఉద్యోగ‌స్తుల్లో పోయింది” సోమవారం బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ కామెంట్స్ ఇవి.

Also Read : మొన్న అయ్యర్.. ఇప్పుడు రోహిత్.. యువ ఆటగాడి తండ్రి ఫేక్ ప్రచారం

ఆయన కామెంట్స్ విన్న పరిశీలకులు, విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. సిపీఎస్ రద్దు వారంలో చేయించేస్తా అని జగన్ మాట్లాడి, మాట తప్పినప్పుడు ఎందుకు ఈయన గారు బయటకు రాలేదని మండిపడుతున్నారు. ఉద్యోగులను వైన్ షాపుల ముందు నిలబెట్టినా, పోలీసులతో వైసీపీ జెండాలు మోయించినా గతంలో ఈయన ఈ స్థాయిలో ఎక్కడా మాట్లాడలేదు. ప్రభుత్వ టీచర్ లను వైన్ షాపుల వద్ద నిలబెట్టిన వ్యవహారం జాతీయ స్థాయిలో వైరల్ అయింది. కానీ దీని గురించి రామ చంద్ర యాదవ్ కామెంట్ చేయలేదు ఎప్పుడూ.

Also Read : బీఆర్ఎస్ జుట్టు.. కేంద్రం చేతిలో పెట్టిన రేవంత్

ఉపాధ్యాయులను నాన్ టీచింగ్ వ్యవహారాలకు వాడుతున్నారని చాలా మంది ఆవేదన వ్యక్తం చేసారు. ఇక వైజాగ్ లో దళిత డాక్టర్ సుధాకర్ వ్యవహారం గురించి కూడా ఈయన అప్పట్లో రోడ్ల మీదకు రాలేదు. కనీసం ఉద్యోగుల హక్కులకు భంగం కలుగుతోందని రోడ్ల మీదకు కూడా ఈయన గారు రాకపోవడం గమనార్హం. తన మాట వినని పోలీసులను అప్పటి జగన్ సర్కార్ ఎన్నో వేధింపులకు గురి చేసింది. అలాగే ఉద్యోగులకు జీతం ఇవ్వకపోయినా, ఎప్పుడు జీతం వేస్తారో తెలియకపోయినా బోడె మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగుల కోసం ఆయన రోడ్ల మీదకు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్