Monday, October 20, 2025 08:38 AM
Monday, October 20, 2025 08:38 AM
roots

రాహుల్, సిరాజ్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు..? బీసిసిఐ సీరియస్..!

భారత ఆటగాళ్ళు దేశవాళి క్రికెట్ ఆడటం లేదనే విమర్శలు మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది ఆటగాళ్ళు అందుబాటులో ఉన్న సమయంలో కూడా స్థానికంగా వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తాజాగా దులీప్ ట్రోఫీ కోసం సౌత్ జోన్ జట్టును ఎంపిక చేసారు. అందులో కెఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ ను సౌత్ జోన్ ఎంపిక చేయలేదు. దీనిపై బోర్డు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసారు. సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న ఆటగాళ్లకు ఒప్పందం ప్రకారం వారికి ప్రాధాన్యత ఇవ్వాలని బోర్డు అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు అధికారికంగా లేఖ రాసింది.

Also Read : భారత్ పై మళ్ళీ అమెరికా ఏడుపు..!

జూలై 27న సౌత్ జోన్ తమ జట్టును ప్రకటించింది. అందులో రాహుల్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు కల్పించలేదు. ఆగస్టు 28న బెంగళూరులో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీని దేశీయ, జాతీయ స్థాయి ప్రదర్శనను కీలకంగా తీసుకుంటారు. వాళ్ళు సగం సీజన్ కు అందుబాటులో ఉన్నా సరే చోటు కల్పించకపోవడాన్ని బోర్డు సీరియస్ గా తీసుకుంది. గత ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఆటగాళ్ళు డొమెస్టిక్ క్రికెట్ ఆడటం లేదనే విమర్శలు వచ్చాయి.

Also Read : పులివెందులలో టీడీపీ బిగ్ స్టెప్..?

దీనిపై బోర్డు కూడా ఆటగాళ్లకు వార్నింగ్ ఇవ్వడంతో విరాట్ కోహ్లీ, గిల్, రోహిత్ శర్మ, రాహుల్ వంటి వాళ్ళు రంజీలు ఆడారు. ఐపిఎల్ కు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు కూడా ఆటగాళ్ళపై ఉండటంతో.. బోర్డు కొన్ని కీలక సూచనలు చేసింది. దేశవాళి సీజన్ క్యాలెండర్ కు ఆటగాళ్ళు అందుబాటులో ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. సౌత్ జోన్ కు తిలక్ వర్మను కెప్టెన్ గా ఎంపిక చేసారు. ఇక శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్ళు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్