Saturday, October 18, 2025 09:43 PM
Saturday, October 18, 2025 09:43 PM
roots

వాళ్ళు ఇద్దరూ జట్టులోనే ఉంటారు.. బోర్డు క్లారిటీ..!

ఒక విషయం గురించి చిన్న వార్త బయటకు వచ్చినా.. పదే పదే దాని గురించి ఎంతో హడావుడి జరుగుతూ ఉంటుంది. గాసిప్స్ కు ఎక్కువ వెయిట్ ఇచ్చే మీడియా.. ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ విషయంలో పదే పదే హడావుడి చేస్తోంది మీడియా. ఆస్ట్రేలియా పర్యటన వారికి చివరిది అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. బోర్డు కూడా వాళ్ళను పక్కన పెడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దీనిపై బోర్డు నుంచి క్లారిటీ రాలేదు.

Also Read : సైలెంట్ గా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటి సిఎం

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ఎంపిక చేసిన సమయంలో.. రోహిత్ ను కెప్టెన్ గా తప్పించడంపై కామెంట్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలో తాజాగా బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్‌ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం ఆయన మాట్లాడారు. రోహిత్, విరాట్ వన్డే జట్టులో ఉండటం తమకు చాలా ప్రయోజనకరం అన్నారు. వాళ్ళు ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్ళు అని కొనియాడారు.

Also Read : అంచనాలను అందుకోలేని తెలుగు కుర్రాడు..?

వాళ్ళిద్దరి సమక్షంలో తాము ఆస్ట్రేలియాపై విజయం సాదిస్తామన్నారు. ఇది వారి చివరి సిరీస్ అనే విషయానికి వస్తే, అలాంటిదేమీ కాదన్నారు. మనం ఈ విషయాల్లోకి ఎప్పుడూ వెళ్లకూడదని, వారు ఎప్పుడు రిటైర్ అవుతారనేది ఆటగాళ్ల ఇష్టమని తెలిపారు. ఇది వారి చివరి సిరీస్ అని చెప్పడం పూర్తిగా తప్పన్నారు. వీరిద్దరూ అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సీరీస్ లో ఆడనున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్