భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే క్రికెట్ నుంచి తప్పుకునే అంశం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో దాదాపు రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఈ ఇద్దరూ గత ఏడాది టి20 క్రికెట్, ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. మిగిలిన వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనితో 2013 లో సచిన్ తరహాలో వీడ్కోలు పలకాలి అనే డిమాండ్ లు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.
Also Read : టార్గెట్ బాబు, పవన్.. ప్రకాష్ రాజ్ కామెంట్..!
దీనిపై బోర్డు కూడా సానుకూలంగా లేదనే వార్తలు అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యాయి. తాజాగా దీనిపై బీసీసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఓ పాడ్ కాస్ట్ లో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. వో రిటైర్ కహా హు (వారు ఎప్పుడు రిటైర్ అయ్యారు)? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ వన్డేలు ఆడతారని స్పష్టం చేసారు. కాబట్టి, వారు ఆడుతున్నప్పుడు మీరు వీడ్కోలు సిరీస్ గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అని ప్రశ్నించారు.
Also Read : జగన్‍కు మరో సవాల్.. ఈసారైనా..!
అవును, వారు దశలవారీగా రెండు ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యారు, కానీ వారు వన్డేలలో ఆడుతున్నారని.. అప్పుడు ఇలాంటి ఆలోచన కరెక్టా అని నిలదీశారు. కాగా అక్టోబర్ లో ఆస్ట్రేలియా సీరీస్ ఉండగా ఆ తర్వాత ఇద్దరూ రిటైర్ అవుతారని భావించగా దానికి రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చేసారు. కాగా ఇటీవల వీరిద్దరూ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో, ఇండియా ఏ తరుపున ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ ఆడే అవకాశాలు సైతం కనపడుతున్నాయి.