Friday, October 24, 2025 06:02 PM
Friday, October 24, 2025 06:02 PM
roots

ఒక్క స్టెప్.. రియల్ పాన్ ఇండియా హీరోగా బాలయ్య..?

అఖండ సినిమా తర్వాత నుంచి నందమూరి బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అప్పటినుంచి ప్రతి సినిమా హిట్ కొడుతున్న బాలకృష్ణ.. ఇప్పుడు అఖండ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ఫాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చాయి అని చెప్పాలి. ఇక సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా టాలీవుడ్ వర్గాల్లో వినపడుతోంది.

Also Read : కొత్త రోహిత్ ను చూసిన ఫ్యాన్స్.. పంథా మార్చేశాడు..!

ఈ సినిమాపై బాలకృష్ణ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి, మరో సినిమాకు వర్క్ చేయకుండా కంప్లీట్ గా టైం కేటాయించారు. ఈ సినిమాపై బాలీవుడ్ మీడియా కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. అఖండ సినిమాకు నార్త్ ఇండియాలో మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాకు కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని బాలీవుడ్ అంచనా వేస్తోంది. హిందుత్వ బ్యాగ్రౌండ్ లో వచ్చే సినిమాలుకు నార్త్ ఇండియాలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. కాంతారా సినిమాకు కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

బాలీవుడ్ లో ఈ సినిమా సరికొత్త రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోల సినిమాలు బాలీవుడ్ లో పెద్దగా ప్రభావం చూపించడం లేదని చెప్పాలి. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్నా సరే.. ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఇక సౌత్ ఇండియా నుంచి సీనియర్ హీరోల సినిమాలు పెద్దగా అక్కడ ఆడటం లేదు. రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలకు పెద్దగా మార్కెట్ ఉండటం లేదు. చిరంజీవి సినిమాలకు కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు.

Also Read : ఆ ఇద్దరినీ వదలను.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..?

బాలకృష్ణ ఒక్కరే సీనియర్ హీరోల్లో బాలీవుడ్ పై కాస్త పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అటు ఓటీటీలో కూడా బాలకృష్ణ సినిమాలకు బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. డాకు మహారాజ్ సినిమాకు కూడా బాలీవుడ్లో మంచి రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. పాన్ ఇండియా స్టార్ లు కావాలని భారీ బడ్జెట్ సినిమాలతో ఒకవైపు యువ హీరోలు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో, బాలకృష్ణ మాత్రం సైలెంట్ గా బాలీవుడ్ లెవెల్ లో హిట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అఖండ సీక్వెల్ కూడా నార్త్ ఇండియా ఫ్యాన్స్ కు నచ్చే విధంగానే ప్లాన్ చేశాడు డైరెక్టర్ బోయపాటి. మహా కుంభమేళాలో అఖండ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున సీన్స్ ప్లాన్ చేయడం.. అక్కడే షూటింగ్ చేయడం కూడా జరిగింది. దీనితో ఈ సినిమా ఖచ్చితంగా అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

పోల్స్