Sunday, March 22, 2026 01:14 PM
Sunday, March 22, 2026 01:14 PM

అజారుద్దీన్ శాఖ అదేనా..? కానీ మరో అడ్డంకి కూడా..?

ఎట్టకేలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గత రెండు రోజుల నుంచి ఈ విషయంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఓ రకంగా అలజడి రేగిందనే చెప్పాలి. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని కొంతమంది నాయకులు తప్పుపడుతున్నారని, కాంగ్రెస్ లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆలోచనలో కూడా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల కారణంగానే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని బిజెపి ఆరోపించింది.

Also Read:  మెగా ఫ్యామిలీకి పోటీగా మహేష్ ఫ్యామిలీ

దీనితో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఎన్నికల సంఘం అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది పరిపాలన అంశాల కిందకు వస్తుంది కాబట్టి ఎన్నికల సంఘం జోక్యం చేసుకోలేదు. ఇక తాజాగా అజరుద్దీన్ రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఎక్కడి నుంచి ఆయనకు కేటాయించే శాఖపైనే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద హోమ్ శాఖ ఉంది. దీనితో ఆ శాఖ ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా మరో శాఖ కూడా కేటాయించవచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది.

Also Read: రోహిత్ పెళ్లిలో అంతా తానైన చంద్రబాబు.. మరి జూనియర్ ఎక్కడ?

మైనారిటీ సంక్షేమ శాఖ కూడా ఆయనకే కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసుల నేపథ్యంలో హోం మంత్రి ఇవ్వకపోవడం మంచిదని పార్టీలో ఉన్న ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించే విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తర్వాతనే ముందుకు అడుగు వేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అటు అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన విషయంలో అసంతృప్తిగా ఉన్న నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్