Sunday, March 22, 2026 04:38 PM
Sunday, March 22, 2026 04:38 PM

పాపం అవంతి.. భవిష్యత్తు ఏమిటో?

ముత్తవరపు శ్రీనివాస్.. అలియాస్ అవంతి శ్రీనివాస్ తెలుగు రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో కీలకంగా పని చేశారు. ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అధినేతకు నమ్మకంగా వ్యవహరించారు. అధినేతను మెప్పించేందుకు ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోశారు కూడా. 2009 నుంచి అధికారం ఉన్న పార్టీలోనే కొనసాగారు అవంతి శ్రీనివాస్. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి తలుచుకుంటేనే అయ్యో పాపం అంటున్నారు ఆయన సన్నిహితులు. కొంతమంది అయితే… అడుసు తొక్కనేల… కాలు కడగనేల అని పాత సామెతను ఉదహరిస్తున్నారు కూడా.

Also Read : గనుల వెంకటరెడ్డిని వెంటాడుతున్నారా..? మళ్ళీ దొరికాడు..!

సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఈ కాపు నేత… రాజకీయ గురువు గంటా శ్రీనివాస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి దక్కించుకున్నారు కూడా. ఇక అంతే.. నాటి సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను మెప్పించడం కోసం నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు కూడా. వైజాగ్ ఎయిర్‌పోర్టులో చంద్రబాబును వైసీపీ నేతలు అడ్డుకోవడం వెనుక నాటి మంత్రి అవంతి హస్తం ఉందనే మాట బలంగా వినిపించింది. ఇక భీమిలిలోని గీతం యూనివర్సిటీ పై దాడి… గోడలు కూల్చివేయడం వంటివి కూడా అవంతి హయాంలోనే జరిగాయి. ఇక రుషికొండ ప్యాలెస్‌ చూసేందుకు వెళ్లిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై అయితే అవంతి ఘాటు వ్యాఖ్యలే చేశారు. తన రాజకీయ గురువు గంటా పార్టీ మారతాడనే పుకార్లపై అయితే… ఎలా వస్తాడో చూస్తా అంటూ ఒంటికాలిపై లేచాడు.

Also Read : శిరిష జోలికి వస్తే.. సిక్కోలు నేతల వార్నింగ్..!

2024 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసిన అవంతి… రాజకీయ గురువు గంట చేతిలో ఏకంగా 90 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఇక అంతే.. ఆ తర్వాత నుంచి సీన్ మారిపోయింది. ఆరు నెలలు సైలెంట్‌గా ఉన్న అవంతి.. వైసీపీకి రాజీనామా చేసేశారు. ఇక్కడే అవంతికి అసలు చిక్కు వచ్చిపడింది. టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నం చేసిన అవంతిని ఆ పార్టీ నేతలు ఛీ పొమ్మన్నారు. దీంతో వెంటనే జనసేన నేతలను సంప్రదించేందుకు యత్నించారు. అయితే అక్కడ కూడా సేమ్ డైలాగ్ ఎదురవ్వడంతో… ఎంపీగా తన పరిచయాలను ఉపయోగించుకుని బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు కూడా చేశారు. అయితే చంద్రబాబును కాదని కూటమి పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని కమలం నేతలు తేల్చి చెప్పడంతో.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో మిగిలిపోయారు. అటు వైసీపీని వదిలేసిన అవంతికి… మరెక్కడా ఆశ్రయం లభించకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు ఆయన సన్నిహితులు. వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నేతలపై నోరు పారేసుకోకుండా ఉండి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు కదా అని కూడా అంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్