ఇంగ్లాండ్ పర్యటన భారత క్రికెట్ కు ఎన్నో జ్ఞాపకాలు అందించింది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత టెస్ట్ జట్టుపై ఎంతో ఒత్తిడి ఉంది. సీనియర్ ఆటగాళ్ళు కూడా ఈ సీరీస్ కు దూరంగా ఉండటం మరింత ఇబ్బంది పెట్టింది. కానీ యువ ఆటగాళ్ళ డామినేషన్ ఇంగ్లాండ్ పిచ్ లపై ఓ రేంజ్ లో సాగింది అనే చెప్పాలి. ముఖ్యంగా సిరాజ్, వాషింగ్టన్ సుందర్, గిల్, పంత్, రాహుల్ అదిరిపోయే ప్రదర్శనలు చేసారు. వీరిలో ప్రధానంగా వాషింగ్టన్ సుందర్ గురించి చెప్పుకోవాలి. ఓవల్ టెస్ట్ లో అతను చేసిన పరుగులే మ్యాచ్ లో భారత్ ను నిలబెట్టాయి.
Also Read : టి20 జట్టులోకి సీనియర్లు..? గిల్ రీ ఎంట్రీ ఖరారు..?
కీలకమైన సమయంలో 53 పరుగులు చేసాడు సుందర్. లోయర్ ఆర్డర్ తో కలిసి కేవలం 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసాడు. దీనితో విమర్శకులు సైతం అతని ఆట తీరుకు ఫిదా అయిపోయారు. ఈ సీరీస్ లో తన తొలి సెంచరీ కూడా చేసాడు. బౌలింగ్ లో కూడా కీలక సమయంలో వికెట్లు తీసి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నాలుగవ టెస్ట్ లో అతని బ్యాటింగ్ కు ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అప్పటి వరకు లోయర్ ఆర్డర్ ఆటగాడిగానే అతనిని చూసిన అభిమానులు.. టాప్ 3 లో ఆడే ఆటగాడు అంటూ కొనియాడారు.
Also Read : ఏపీ రాజకీయాల్లోకి మరో స్టార్ యాక్టర్, తమిళమా..? తెలుగా..?
కీలక సమయంలో అతను చేసిన సెంచరీ.. చాన్నాళ్ళ పాటు గుర్తుంటుంది అనడంలో ఏ సందేహం లేదు. అతనిపై తాజాగా భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ కూడా ప్రశంశలు కురిపించాడు. వాషింగ్టన్ సుందర్ జట్టులో ప్రీమియర్ ఆల్ రౌండర్ గా స్థిరపడకపోతే తాను ఆశ్చర్యపోతాను అంటూ కామెంట్ చేసాడు. అతను 50 టెస్ట్ లకు పైగా ఆడతాడని తాను ఆశిస్తున్నా అన్నాడు. అటు రికీ పాంటింగ్ కూడా సుందర్ ను టాప్ 3 లో ఆడించాలని కోచ్ గంభీర్ కు సూచించాడు. అతని సత్తాను అర్ధం చేసుకుంటే భారత జట్టుకు పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అంటూ కొనియాడాడు.

