Thursday, February 5, 2026 03:14 PM
Thursday, February 5, 2026 03:14 PM

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి గుంజి” కొడతారా..?

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో హింస కూడా శృతి మించితే… జనాలు ఛీ కొడతారు. అయితే కొంతమంది నటీనటులు మాత్రం.. తమకున్న పొగరుతో.. ఇంకా చెప్పాలంటే ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో సినిమాల్లో ఏం చూపించినా నడుస్తుందని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇదంతా ఎందుకూ అంటే.. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ వేడుకలో జరిగిన ఆ హీరో పాడిన పాట పెద్ద దుమారం రేపుతోంది. చివరికి సీనియర్ దర్శక, నిర్మాతలు, వేడుకకు వచ్చిన అతిథులు కూడా అలా జరుగుతుందని మాకు తెలియదు.. తెలిసి ఉంటే.. వెళ్లేవాళ్లమే కాదు.. అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.

సీరియల్ నటుడు, బుల్లితెర మెగాస్టార్‌ అంటూ పాపులర్ అయిన ప్రభాకర్ తన కుమారుడు చంద్రహాస్‌ను హీరోగా వెండి తెరకు పరిచయం చేశారు. రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చంద్రహాస్ ఆ సినిమా ప్రమోషన్ల సమయంలో చూపించిన యాటిట్యూడ్‌తో ‘యాటిట్యూడ్ స్టార్’గా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. తాజాగా ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే సినిమాలో హీరోగా చేశాడు చంద్రహాస్. అయితే ఈసారి కూడా అతడు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఏకంగా అతడిపై పోలీసు కేసు కూడా నమోదైంది. ఓ జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్..!

చంద్రహాస్‌ హీరోగా నటించిన బరాబర్‌ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో చంద్రహాస్‌ వేదికపై ఓ పాట పాడాడు. అందులో అసభ్యకర పదాలు ఉండటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పాట రా బాబు.. అంటూ దుమ్మెత్తి పోశారు. ఇక ఇదే పాటపై జర్నలిస్టు అశోక్‌ కుమార్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ భాష సరైంది కాదని హెచ్చరిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. దీనికి స్పందించిన చంద్రహాస్‌.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో జర్నలిస్టును బెదిరిస్తూ వీడియో పోస్ట్‌ చేశాడు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని.. లేదంటే.. ఏం చేయాలో నాకు తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశాడు చంద్రహాస్.

‘ఎన్నో సార్లు రీజన్ లేకుండానే నన్ను ట్రోల్ చేశారు. నన్ను అనరాని మాటలు అన్నారు. మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు అప్పుడు ఏమైపోయాయి?. నాపై మీమర్స్ వాడిన పదాల్లో.. నేను రెండు మాత్రమే వాడా. అవేమీ అంత పెద్ద పదాలు కూడా కాదు. అయినా నన్ను కావాలని కెలికారు. 24 గంటలు టైం ఇస్తున్నా. నాకు 24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే నీ సంగతి చూస్తా’ అని వీడియోలో చంద్రహాస్ బెదిరించాడు. దీనిపై అశోక్ కుమార్ కూడా ఘాటుగానే బదులిచ్చారు. చంద్రహాస్‌పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు తాను సిద్ధమే అని సవాల్ విసిరారు. చంద్రహాస్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో అశోక్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : బాబు-పవన్ భేటీ.. ఆ విషయంపై క్లారిటీ..!

ఇక ఈ పాటపై ఇప్పుడు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. సమాజంలో ఇలాంటి పాటలు పాడటం సరేనా అని చంద్రహాస్‌ను నిలదీస్తున్నారు. కుటుంబ సభ్యులు, మహిళల ముందే బూతు పదాలతో పాట పాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రహాస్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటపై పెద్ద దుమారం రేగడంతో దర్శక నిర్మాతలు స్పందించారు. వేదికపై ఇలాంటి పాట పాడటం తప్పే అని విచారం వ్యక్తం చేశారు. అసలు అప్పటి వరకు ఆ పాట పాడుతున్నట్లు తమకు తెలియదన్నారు. సినిమాలో అలాంటి పాట లేదన్నారు. ఇక ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నటుడు జేడీ చక్రవర్తి కూడా ఈ పాటపై విచారం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్లు విభిన్నంగా చేయడం తప్పు కాదని.. కానీ, అవి మహిళలను కించపరిచేలా, అసభ్యంగా ఉండకూడదన్నారు.

మొత్తానికి ‘యాటిట్యూడ్ స్టార్’ గా వైరల్ అయిన చంద్రహాస్ తన తీరుతో మరోసారి విమర్శల పాలవుతున్నారు. నిన్నటి వరకు మీమర్స్‌కు టార్గెట్‌గా మారిన చంద్రహాస్.. ఇప్పుడు కొత్తగా కేసులతో మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు అయ్యింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

మల్లన్న దగ్గర కూడా...

2019 నుంచి 2024 వరకు ఏపీలో...

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

పోల్స్