Wednesday, February 4, 2026 05:57 PM
Wednesday, February 4, 2026 05:57 PM

సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్..!

సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారి పెద్ద పండుగ. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చిన్నా పెద్దా అంతా కలిసి గొప్పగా చేసుకుంటారు. అందుకే సంక్రాంతి పండుగ కోసం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా సొంతూరుకు పెద్ద ఎత్తున వచ్చేస్తారు. ప్రధానంగా సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు. ఈ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందుకోసం నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు కూడా. రైల్వే శాఖ గతంలో 120 రోజుల ముందు రిజర్వేషన్ అందుబాటులోకి తీసుకువచ్చేది. దానిని ఇప్పుడు 60 రోజులకు కుదించింది. ఇప్పటికే సంక్రాంతి పండుగ ముందు రోజుల్లోని అన్ని రైళ్లు ఫుల్ అయిపోయాయి. దీంతో 52 స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. వీటిల్లో స్పెషల్ ధరలు వసూలు చేస్తున్నాయి.

Also Read : వంశీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్ట్

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. గతానికి భిన్నంగా ఈ సారి ఏకంగా 7,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. వీటిల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయటం లేదని కూడా ఆర్టీసీ ప్రకటించింది. అదే సమయంలో రాను పోను టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ కూడా ఇస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దీంతో టికెట్లు విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ దాదాపు అయిపోయాయి.

Also Read : సురేష్ కు సుప్రీం షాక్.. ఇప్పట్లో బయటకు రావడం కష్టమే..?

గతానికి భిన్నంగా ఈసారి సంక్రాంతి సెలవులు పది రోజులు వచ్చాయి. 10వ తేదీ వైకుంఠ ఏకాదశి నుంచి 19వ తేదీ వరకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అటు తెలంగాణ సర్కార్ కూడా విద్యా సంస్థలకు పది రోజుల పాటు సెలవులు ప్రకటించి 20న రీ ఓపెనింగ్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక సాఫ్ట్‌వేర్ బ్యాచ్ కూడా శుక్రవారం సెలవు పెట్టుకుంటే… వరుసగా 5 రోజుల పాటు సెలవులు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో నివసించే వాళ్లు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సొంత వాహనాలు ఉన్నవాళ్లు మాత్రం హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్రవారం ఉదయమే స్టార్ట్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఇబ్బందులు పడతామని భయపడుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా టోల్ గేట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్