వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు ఏపీలో అధికారంలో ఉంది. 2019 నుంచి 2024 వరకు సరిగ్గా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. ఏపీ ప్రజలకు మర్చిపోలేని పరిపాలన అందించింది. ఐదేళ్ల పాటు విధ్వంసకరమైన పాలనతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రకృతి కూడా వైసీపీ పాలనకు భయపడిపోయింది. ఐదేళ్ల పాలనలో కరోనా వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. భారీ వర్షాలకు అన్నమయ్య, పింఛా వంటి డ్యామ్‌లు కొట్టుకుపోయాయి. గుండ్లకమ్మ, పులిచింతల, ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయాయి. చివరికి కోనసీమ జిల్లా రైతులు క్రాప్ హాలిడా కూడా ప్రకటించారు. ఇక ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. చివరికి చెత్త మీద కూడా పన్ను విధించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ఇక ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. వారిపై కేసులు పెట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. చివరికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడికి తెగబడిన చరిత్ర వైసీపీ నేతల సొంతం.
Also Read : ఎందుకు ఈ మౌనం.. సాక్షి తప్పుడు ప్రచారంపై సైలెంట్ గా కూటమి
ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలను సర్వ నాశనం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను తన స్వార్థానికి వాడుకున్నారు జగన్. ఆడించినట్లు ఆడిన అధికారులు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. కొందరు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఐదేళ్ల తుగ్లక్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానులంటూ విచిత్రమైన ప్రతిపాదన చేశారు. మహిళలపై దాడులు.. ప్రశ్నించిన వారిపై కేసులు.. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ కూడా చేశారు. అలాంటి వారికే జగన్ పదవులు కట్టబెట్టారు. ఇక ఆలయాలపై దాడులు, అంతర్వేది రథం దగ్ధం, హనుమాన్ జంక్షన్‌లో ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరగొట్టారు.. దుర్గ గుడిలో వెండి రధంపైన సింహాల దొంగతనం.. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల అమ్మకాల్లో అవినీతి.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని.
Also Read : పోలీసులే జగన్ కు చుక్కలు చూపిస్తారా…?
చివరికి నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి 53 రోజుల పాటు అక్రమంగా జైలులో ఉంచారు. ఇవన్నీ గమనించిన ఏపీ ప్రజలు.. వైసీపీ నేతలకు ఓటుతో బదులిచ్చారు. వై నాట్ 175 అన్న జగన్‌కు.. వై ప్రతిపక్షం అంటూ జవాబిచ్చారు. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు మకాం మార్చేశారు. ఇక తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసు కూడా మూసేశారు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూటమి సర్కార్ విచారణకు ఆదేశించింది. ఇందులో ఇప్పటికే పలువురు కీలక నేతలను పోలీసులు అరెస్టు కూడా చేశారు. వల్లభనేని వంశీ, కాకాణి గోవర్థన్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి ప్రముఖులు జైలుకు వెళ్లారు. ఇక రేపో మాపో వైఎస్ జగన్, భారతీ రెడ్డి అరెస్టు కూడా ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.
Also Read : కమలం గూటికి దువ్వాడ..? ఆ నేతతో చర్చలు మొదలు..?
ముఖ్యనేతల అరెస్టుతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది. ఈ భయం పొగొట్టేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలను ఊద్దేశించి జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తామంటూ బెదిరించారు. కొందరు పోలీసులను అయితే బహిరంగంగానే బెదిరించారు. బట్టలూడదీస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరి సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్ చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ సైకోలు.. ఇప్పుడు రెచ్చిపోతున్నారు. టీడీపీ కార్యకర్తలపై ఇప్పటి నుంచే దాడులకు తెగబడుతున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు. ఇక మహానాడు సక్సెస్ వైసీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయింది. దీంతో మరింత రెచ్చిపోయిన సైకోలు నడిరోడ్డుపై పిచ్చిపిచ్చిగా రెచ్చిపోతున్నారు.
Also Read : మహానాడు తెచ్చిన మార్పులు..!
రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా అధినేత కోసం మాజీ మంత్రి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక జగన్‌ను చూసేందుకు వచ్చిన వైసీపీ సైకోలు.. పిచ్చి పట్టినట్లుగా వ్యవహరించారు. అటుగా వెళ్తున్న చిన్న పిల్లాడు సైకిల్ లాక్కున్నారు. దానిని నేలకేసి కొట్టారు. సైకిల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంకుల్ సైకిల్ అని పిల్లాడు ఏడుస్తున్నా జాలీ చూపలేదు. సైకిల్‌ను కాళ్లతో తొక్కి విరగొట్టారు. ఈ సైకోల చర్యలతో ఒక్కసారిగా భయపడిన పిల్లాడు.. సైలెంట్‌గా సైకిల్ తీసుకుని వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగన్ 2.0 ఎలా ఉంటుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే.. ప్రజలపై దాడులు పెరిగిపోతాయనడానికి ఈ ఒక్క ఘటన చాలు అంటున్నారు. ఇంత దారుణంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న పిల్లాడిపై మీ ప్రతాపం ఏమిటని ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. కొందరైతే.. సైకో పార్టీనా మజాకా.. అని కామెంట్ చేస్తున్నారు.




