Wednesday, February 4, 2026 12:20 PM
Wednesday, February 4, 2026 12:20 PM

మావోయిస్టుల అరెస్టుపై పోలీసుల సంచలన ప్రకటన.. అందుకే బెజవాడ వచ్చారా..?

మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో కుదేలైన మావోయిస్టు పార్టీ.. ఇప్పుడు కీలక నేతల అరెస్టులుతో మరింత పతనం దిశగా సాగుతోంది. నిన్న ఏపీలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడుతూ ఆశక్తికర కామెంట్స్ చేశారు. నేడు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులు కు మధ్య కాల్పులు జరిగాయన్నారు. ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉందని తెలిపారు.

Also Read : మాడ్వీ హిడ్మా.. వైలేంట్ హిస్టరీ.. సిఎం అభ్యర్ధినే లేపేసిన చరిత్ర..!

ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారని, నిఘా వర్గాలు వారి కదలికలు పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టామని వివరించారు. నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారని, వాళ్ల నుంచి సేకరించిన సమాచారం తో ఎక్కడెక్కడ మావోయిస్టులు లు ఉన్నారని దృష్టి పెట్టామన్నారు. యన్టీఆర్‌, కృష్ణా, కాకినాడ,‌కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులు లను పట్టుకున్నామని తెలిపారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు.

రాష్ట్ర చరిత్ర లో ఇంతమంది కీలక వ్యక్తును పట్టుకోవడం ఇదే ప్రధమమన్న ఆయన.. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను పట్టుకున్నామని తెలిపారు. వెపన్స్ 45, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రి ని పట్టుకున్నామని పేర్కొన్నారు. మా ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారని అభినందించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు లడ్డా. మా ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసిందని.. మాకు ముందే సమాచారం వచ్చిన తర్వాత .. వారి పై నిఘా పెట్టామన్నారు.

Also Read : అగ్రనేత కోసమే బెజవాడలో అడుగు పెట్టారా..?

వారి ఆలోచనలు, కార్యకలాపాలు ను గమనించామని.. అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ లో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారని.. వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఎపిలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారని వివరించారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, వారి మూవె మెంట్, ప్లాన్ల పై ఇతర సమాచారం లేదని తెలిపారు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారం లో నిజం లేదని స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్