Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

బీ కేర్ ఫుల్.. జగన్‌కు మాస్ వార్నింగ్..!

“మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పోలీసుల బట్టలూడదీస్తాం.. ఉద్యోగాల నుంచి పీకేస్తాం.. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే జుట్టు పట్టుకుని లాక్కొస్తాం.. నడిరోడ్డుపై పరిగెత్తిస్తాం..” ఇవే ఈ మధ్య కాలంలో జగన్ తరచూ చెబుతున్న మాటలు. శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన నోటి దూల ప్రదర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తను బంధువులే హత్య చేశారు. అయితే ఇదేదో టీడీపీ నేతలు చేశారని.. వీరికి పరిటాల కుటుంబం అండగా ఉందంటూ తెగ గగ్గొలు చేశారు. ఇక శవం ఉంటే తప్ప బయటకు రాని జగన్.. రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు.

Also Read : ఇప్పుడేం వద్దు.. చంద్రబాబు, పవన్ కీలక నిర్ణయం..?

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి విషయాన్ని తప్పే అన్నట్లుగా జగన్‌తో పాటు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆస్తి వివాదాలు, భూ తగాదాలకు, ఆధిపత్య పోరు వల్ల జరిగిన హత్యలు, దాడులను కూడా రాజకీయ హత్యలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. వీటి వల్ల ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలనేది వైసీపీ నేతల గేమ్ ప్లాన్. అందుకే ఎక్కడ శవం ఉంటే.. అక్కడికి వెళ్తున్న వైఎస్ జగన్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి. కానీ అందుకు బదులుగా రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని… తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి పరామర్శించిన జగన్.. ఆ రోజు నుంచి నేటి వరకు పోలీసులపై నోరు పారేసుకుంటూనే ఉన్నారు. పోలీసులను బట్టలూడదీసి కొడతామంటూ వ్యాఖ్యలు చేశారు.

Also Read : గవర్నర్ లకు సుప్రీం పరోక్ష వార్నింగ్

జగన్ వ్యాఖ్యలకు పోలీసులు ధీటుగా విమర్శలు చేశారు. “జగన్.. పోలీసులను బట్టలూడదీసి కొడతా అంటున్నావు.. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలనుకున్నావా.. కష్టపడి, చదవి, రన్నింగ్ రేసుల్లో, పరీక్షల్లో పాసై.. ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. ఎవడో వచ్చి ఊడదీస్తా అంటే.. ఊడదీయటానికి ఇదేమి అరటితొక్క కాదు. మేము నిజాయతీగానే ప్రజల పక్షాన నిలబడతాం. నిజాయతీగానే ఉద్యోగం చేస్తాం. నిజాయతీగానే చస్తాం. అంతేతప్ప అడ్డమైన దారులు తొక్కం.. జాగ్రత్తగా మాట్లాడు..” అంటూ రామగిరి ఎస్సై సుధాకర్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్సై సుధాకర్ చేసిన వ్యాఖ్యలకు పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. ప్రతి ఒక్కరు పోలీసులనే టార్గెట్ చేస్తున్నారని.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తప్పేంటి అని వ్యాఖ్యానిస్తున్నారు. మరోసారి ఇలా పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్