Sunday, March 22, 2026 03:00 PM
Sunday, March 22, 2026 03:00 PM

అమరావతిపై విషం.. గులాబీ కార్యకర్తలను వదలొద్దు అంటున్న ప్రజలు..!

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు వైసిపి విషం చిమ్ముతూనే ఉంది. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కొందరు వ్యక్తులు అమరావతి విషయంలో అత్యంత దారుణంగా ప్రచారం చేయడానికి టిడిపి కార్యకర్తలు తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో కమ్మ కులాన్ని వ్యతిరేకించే కొందరు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రచారానికి దిగుతున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిలో ఓ అధికారికి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.

Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటో..?

అయితే ఇక్కడ.. వైసీపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి సహకరిస్తుంది. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ముందు నుంచి అమరావతి విషయంలో ఇదే ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో వరద ఉన్న ఫోటోలు కూడా చూపించి అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాత ఫోటోలు కూడా బయటకు తీసి వాటిని మార్ఫింగ్ చేసి అమరావతి మునిగిపోయింది అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ప్రతి వర్షాకాలం ఇదే తంతు కొనసాగుతోంది.

Also Read : వాళ్ళను చంద్రబాబు వదలరు.. అసెంబ్లీలో కొత్త చట్టం

దీంతో ఆ పార్టీ కార్యకర్తలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినపడుతున్నాయి. తాజాగా హోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అమరావతిపై తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారికి మాత్రమే ఇది వర్తించకూడదని తెలంగాణలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని సోషల్ మీడియాలో టిడిపి కార్యకర్తలు కోరుతున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటుగా అమరావతిని అత్యంత దారుణంగా అవమానిస్తున్న బి.ఆర్.ఎస్ కార్యకర్తలను వదలొద్దని.. ఈ ప్రచారంతో పారిశ్రామిక రంగంలో కూడా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మునిగిపోయిన మాట్లాడని ఆ పార్టీ కార్యకర్తలు అమరావతి విషయంలో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్