Wednesday, February 4, 2026 05:50 PM
Wednesday, February 4, 2026 05:50 PM

పరకామణిలో చోరీ చిన్నది కాదు.. ఏపీ హైకోర్టు సంచలన కామెంట్స్ 

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్నాళ్లుగా పరకామణి వ్యవహారం సంచలనం అవుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అధికారులు విచారణ వేగవంతం చేయగా.. కీలక సాక్షి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ కేసు మరింత ఉత్కంఠను రేపుతోంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇటీవల వైసిపి నేతలు స్పందిస్తున్న విధానం కూడా చాలామందిని ఆశ్చర్యపరిచింది. పరకామణిలో చోరీ వ్యవహారాన్ని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిన్నదిగా కొట్టి పారేయడం.. అతను ఆస్తులు టీటీడీకి రాసిచ్చాడు అని చెప్పే ప్రయత్నం చేయడం, దీనిని ఇతర వైసీపీ నేతలు సమర్థించడం వంటివి మనం చూసాం.

Also Read : ఏపీలో ఆక్టివ్ అయిన బీజేపీ కోవర్టులు..?

ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు ఇటీవల కాలంలో కాస్త దూకుడుగానే ఆదేశాలు ఇస్తుంది. ఈ కేసులో సాక్షులుగా, నిందితులుగా ఉన్నవారికి భద్రత కల్పించాలంటూ కూడా ఏపీ హైకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజకీయ ప్రాధాన్యత కూడా ఉండటంతో పరిణామాలు ఎటు దారి తీస్తాయా అనేది అటు సామాన్య భక్తుల్లో కూడా ఒక రకమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ధర్మాసనం నేడు సంచలన వ్యాఖ్యలు చేసింది.

Also Read : జగనన్నపై ఫైర్ బ్రాండ్‌ ఆగ్రహం..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను వాడుకలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. టీటీడీలో ఔట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కాదని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదని అభిప్రాయబడింది. బాధ్యతారాహిత్యం కారణంగానే పరకామణిలో చోరీ ఘటన జరిగినట్లు అభిప్రాయబడింది. విరాళాల లెక్కింపు వద్ద టేబుల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. భక్తులను విరాళాలు లెక్కింపులోకి ఎందుకు తీసుకోకూడదు అని ప్రశ్నించింది. ఆగమ శాస్త్రం ప్రకారం లెక్కింపులో భక్తుల మనోభావాలు దెబ్బ తినవద్దని, పరకామణిలో జరిగిన నేరం.. దొంగతనం కన్నా మించినది అంటూ ఏపీ హైకోర్టు సంచలన కామెంట్ చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

పోల్స్