వలసల విషయంలో అమెరికా సర్కార్ అనుసరిస్తున్న వైఖరి ప్రపంచ దేశాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇటీవల హెచ్ 1 బీ వీసాల ఫీజులను లక్ష డాలర్లకు పెంచడంతో.. భారత్ సహా అనేక దేశాల్లోని నిపుణులు కంగు తిన్నారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్ 1 బీ వర్కర్ వీసా కార్యక్రమంలో నిబంధనలను కఠినతరం చేసేందుకు.. అమెరికా సెనేట్ లోని అగ్రశ్రేణి చట్టసభ సభ్యులు ఓ సంచలన బిల్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్ ప్రకారం యజమానులు చట్టంలో ఉన్న లొసుగులను దుర్వినియోగం చేస్తున్నారట.
Also Read : పార్టీ మారారా లేదా.. బీఆర్ఎస్ కొత్త గేమ్ ప్లాన్..!
ఇప్పుడు ఆ నిబంధనలను మార్చేందుకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్లు ఎల్-1 వీసా వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. మల్టీ నేషనల్ కంపెనీలు తమ ప్రస్తుత ఉద్యోగులను విదేశీ ఆఫీసుల నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వనుంది ఈ బిల్. అయితే వాళ్ళు వారి పౌరులు మాత్రమే కావడం గమనార్హం. వేతనాలు, నియామక ప్రమాణాలను పెంచడం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను తప్పనిసరి చేయడం, వీసా అర్హతలను తగ్గించడం ద్వారా నియమాలను కఠినతరం చేయడం ఈ బిల్ లక్ష్యం.
Also Read : ప్రముఖ కంపెనీతో టచ్ లోకి లోకేష్.. గుజరాత్ వర్సెస్ ఏపీ..?
ఇక ఈ బిల్ లో భాగంగా స్టెమ్ డిగ్రీలు ఉన్న వారికి కాస్త ఉపశమనం కల్పిస్తుంది. అంటే స్పెషలిస్ట్ రంగంలో.. నిబంధనలను కఠిన తరం చేస్తారు. దీని ప్రకారం వారికి బ్యాచిలర్ డిగ్రీ కావాల్సి ఉంటుంది. వేతన నియమాలను ఉల్లంఘించినట్లు తేలితే ఏ యజమాని అయినా జరిమానాలు లేదా డిబార్‌మెంట్ కు గురవుతారు. రిపబ్లికన్ చక్ గ్రాస్లీ మరియు డెమొక్రాట్ డిక్ డర్బిన్ ఈ చట్టాన్ని ప్రతిపాదించారు. అటు అమెరికా ఏజెన్సీలు హెచ్ 1 బీల నిబంధనల విషయంలో సర్కార్ పై పోరాటం చేసేందుకు కూడా సిద్దమవుతున్నాయి.