Sunday, March 22, 2026 12:53 PM
Sunday, March 22, 2026 12:53 PM

నందిగం సురేష్ ను వెంటాడుతున్న పాత పాపాలు..!

వైసీపీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో పోలీసు శాఖ పట్టుదలగా ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆదేశాలతో నందిగం సురేష్ అరాచకాలు చేసారనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో నందిగం సురేష్ కొన్ని పాపాలు కూడా చేసారని, అలాగే అక్రమంగా సంపాదించారు అని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. అసలు ఏమీ లేని వ్యక్తి భారీగా ఆస్తులు ఎలా సంపాదించాడు అని టీడీపీ ప్రశ్నిస్తూ ఉంటుంది.

ఇక జగన్ ఆదేశాలతోనే ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగారు అనే ఆరోపణ ఉంది. ఈ కేసులో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. ఇక ఆయనకు ఓ హత్య కేసులో మంగళగిరి కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దాదాపు నెల రోజుల నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఇక ఇప్పుడు పోలీసులు మరో కేసు బయటకు తీసారు. సత్తెనపల్లి కోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సరెండర్ అయ్యారు ఓ కేసులో. 2020 లో అమరావతి రాజధాని కోసం మహిళల పై అసభ్యంగా ప్రవర్తించారు మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి.

Also read : రెడ్‌ బుక్‌ కౌంటర్‌గా గుడ్‌ బుక్‌… జగన్ ప్లాన్ వర్కవుట్‌ అవుతుందా..?

దీనిపై మండవ మహాలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేసారు. దీనిపై 2020 ఫిబ్రవరిలో అమరావతి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసారు. సెక్షన్ 323,354,506,509, r/w34 కింద నందిగం సురేష్ ,లేళ్ళ అప్పిరెడ్డి మరియు కొందరి పై కేసు నమోదు అయింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం అండదండలతో ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేయలేడు. ప్రస్తుతం నందిగం సురేష్ రిమాండ్ ఖైదీ గా జైలు లో ఉండటంతో పీటీ వారెంట్ తో ఎప్పుడైనా కోర్ట్ లో హాజరుపరుస్తారు అని తెలియడంతో 2 వ ముద్దాయిగా ఉన్న అప్పిరెడ్డి ఈ రోజు సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారి ఎదుట సరెండర్ అయ్యారు. ఆయనకు ఈ కేసులో జడ్జి బెయిల్ మంజూరు చేసారు. నందిగం సురేష్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్