Friday, October 24, 2025 09:29 AM
Friday, October 24, 2025 09:29 AM
roots

రంగంలోకి దిగిన దొంగ మేధావులు.. టిడిపి జాగ్రత్త పడకపొతే ఇబ్బందులే

రంగంలోకి దిగిన దొంగ మేధావులు.. టిడిపి జాగ్రత్త పడకపొతే ఇబ్బందులే

2019 లో ఎంతో హోరాహోరీగా జరుగుతాయి అనుకున్న ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ ఎన్ని రకాల వ్యూహాలు రచించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టి‌డి‌పిని దెబ్బతీయడానికి ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి.. టి‌డి‌పిని రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీసింది. ఇక రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కొంతమంది తెరపైకి వచ్చి చంద్రబాబు, పవన్‌ని వ్యక్తిగతంగా తిట్టడం.. కులాల మధ్య విద్వేషాలు రేపడం.. టి‌డి‌పి, జనసేన మధ్య చిచ్చు పెట్టడం లాంటి కార్యక్రమాలు చాలానే చేశారు. అసలు రాజకీయ వ్యూహాలు ఇంత పైశాచికంగా ఉంటాయా? అనే విధంగా ప్రశాంత్ కిషోర్ అధ్వర్యంలో వైసీపీ రాజకీయం చేసింది.

అప్పుడు వైసీపీ కోసం.. టి‌డి‌పిని, జనసేనని దెబ్బతీయడం కోసం.. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం అని హడావిడి చేసి, లేనిపోని ఆరోపణలు చేస్తూ.. ఆ సామాజికవర్గం మొత్తాన్ని దాదాపుగా టిడిపికి దూరం చేయడంలో విజయవంతం అయ్యారు. ఇక రమణ దీక్షితులు పింక్ డైమండ్ పేరుతో చెప్పిన కధలు ఇప్పటికీ కధలు కధలుగా చెప్పుకోవచ్చు. మరో వైపు నుంచి రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు పై ఎన్టీఆర్ అభిమానులకు ద్వేషం పెంచే విధంగా సినిమా తీసి ఎన్టీఆర్ అభిమానులకి, చంద్రబాబుకి మధ్య దూరం పెంచారు.

ఇక పోసాని, మోత్కుపల్లి నరసింహులు, శ్రీరెడ్డి, కత్తి మహేశ్, కోన వెంకట్.. అబ్బో ఇలా ఒకరు ఏంటి.. చాలా మంది మేధావుల రూపంలో వైసీపీ భావజాలాన్ని సోషల్ మీడియాలో నింపేశారు. వారు వైసీపీ భావజాలాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తున్నట్లు అటు టిడిపి, ఇటు జనసేన అంచనా వేయలేకపోయాయి. పసిగట్టే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇక 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వారు చేసిన ఆరోపణల్లో ఏదీ నిజం కాదని తేలింది. అయితే మరొకసారి వైసీపీని గెలిపించడం కోసం ఈ పెయిడ్ ఆర్టిస్టులు రంగంలోకి దిగేశారు. ఇప్పటికే పోసాని సడన్ గా ప్రెస్ మీట్లు పెట్టి.. బాబు, పవన్ లపై లేనిపోని అబద్దాలు ప్రచారం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఆర్జీవీ.. జగన్ తో పలుమార్లు భేటీ అయ్యి.. వ్యూహం అనే సరికొత్త రాజకీయ సినిమాని మొదలుపెట్టారు.

ఇటు ముద్రగడ కూడా ఎంట్రీ ఇచ్చి కాపు సామాజికవర్గాన్ని మరోసారి చీల్చే ప్రయత్నం మొదలుపెట్టారు. శ్రీరెడ్డి తన వంతు పాత్ర నిత్యం పోషిస్తూనే ఉంది. ఇంకా వైసీపీ భజన మీడియా, కొందరు మేధావులు, జర్నలిస్టులు రంగంలోకి దిగేస్తున్నారని… కాబట్టి జాగ్రత్తగా ఉండాలని టి‌డి‌పి, జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ప్రజలు ఈసారి కూడా ఐప్యాక్ ఉచ్చులో పడి తమ ఓటుని కులం ఆధారంగా, మతం ఆధారంగా లేక డబ్బుకి ఓటేస్తారా లేక నిజంగా తమకి మంచి చేసే నాయకుడికి పట్టం కడతారా అన్నది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్