Wednesday, February 4, 2026 10:36 PM
Wednesday, February 4, 2026 10:36 PM

జేసి ఫ్యామిలీని పోలీసులు ఇంకా వేధిస్తున్నారా…?

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జేసి కుటుంబాన్ని ఏ విధంగా వేధించారు అనేది అందరికి క్లారిటీ ఉంది. ముఖ్యంగా పోలీసు అధికారుల నుంచి ఆ కుటుంబం నానా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు కూడా పోలీసులు జేసిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. దీనితో జేసి ప్రభాకర్ రెడ్డి ఘాటైన లేఖ రాసారు పోలీసు అధికారులకు. కడప , అనంతపురం పోలీసులకు జేసి ప్రభాకర్ రెడ్డి ఘాటైన లేఖ రాసి కీలక వ్యాఖ్యలు చేసారు. అక్టోబక్ 15 నుంచి నా వాహనాలు ఆర్టీపిపి లో లోడింగ్ ఆపారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ కావాలనే ఆపాడని ఆయన అందులో పేర్కొన్నారు.

Also Ready: పరారీలోనే కీలక కేసుల్లో నిందితులు.. కారణం..?

ఈవిషయంపై కడప ఎస్పికి , జమ్మలమడుగు డియస్పికి అనేక సార్లు లేఖ రాశానన్న ఆయన.. కాని దానిని వారు పట్టించుకోలేదని భూపేష్ చట్టాన్ని తన చేతులలోకి తీసుకున్నాడని పేర్కొన్నారు. ఈనెల23న మాకు వేరే దారిలేక కడప నుంచి వస్తున్న అక్రమ ఇసుక , సిమెంట్ వాహనాలు ఆపించామన్నారు. మేము చట్టప్రకారం నడుచుకునే వ్యక్తులం అని స్పష్టం చేసారు. ఈనెల 25న తాడిపత్రి రూరల్ పోలీసుల ఆదేశాల మేరకు మా వెహికల్స్ లోడింగ్ కోసం వెయిట్ చేశామని… కాని అలా జరగలేదన్నారు. రేపు నా వాహనాలు ఆర్టీపిపి లోడింగ్ కు వెళతాయని పేర్కొన్నారు.

Also Read: ఆ 5 ఏళ్ళు మర్చిపోను.. చంద్రబాబు సంచలన కామెంట్స్

వాటిని అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నేను రాత్రి కి రాత్రి రాజకీయ నేతగా ఎదగలేదన్న ఆయన దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నానని పేర్కొన్నారు. భూపేష్ గత కొద్దిరోజుల క్రితం అదానీ గ్రూప్ వారిపై కూడా దౌర్జన్యం చేశాడన్నారు. మాపై జరుగుతున్న పరిణామాలపై విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. గట్టిగా సమాధానం చెబుతానన్నారు. మా వాహనాలు లోడింగ్ కాకుండా ఆపితే సహించనని స్పష్టం చేసారు. టిడిపి అధికారం కోల్పోయినప్పుడు ఆదినారాయణ రెడ్డి బిజేపిలో చేరాడని… కాని నేను అలాంటి వాడిని కాదన్నారు. వైసిపి హయాంలో నాపై 95 ఫాల్స్ కేసులు నమోదయ్యాయని… కాని ఏరోజు భయపడలేదని స్పష్టం చేసారు. నేను అవినీతి పరుడిని కాదని పేర్కొన్న ఆయన ఆర్టీపిపిలో వాహనాలు ఆపడం నా పరువుకు సంభందించిందన్నారు. దానికోసం నేను అన్నింటికీ సిద్దపడే ఉన్నానని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్