Sunday, March 22, 2026 08:30 AM
Sunday, March 22, 2026 08:30 AM

కర్ణాటక కాంగ్రెస్ మంత్రికి భారీ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా…?

జాతీయ స్థాయిలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల విషయంలో చాలా పక్కాగా అడుగులు వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా సీట్లు గెలుచుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఉత్తరాదిలో క్రమంగా పట్టుకోల్పోవడంతో దక్షిణాది రాష్ట్రాలపై ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక విషయంలో కాస్త సీరియస్ గానే వర్కౌట్ మొదలుపెట్టింది బిజెపి అధిష్టానం.

గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని భావిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు బిజెపి అగ్ర నేతలు. మొన్నామధ్య మంత్రి డీకే శివకుమార్ కు బిజెపిలో కీలక పదవి అలాగే కేంద్రంలో కూడా మంచి పదవి ఇచ్చేందుకు ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఆయనకు ఏమాత్రం పొసగడం లేదని ప్రచారం జరిగింది.

Also Read : సేఫ్ జోన్ లో కొడాలి.. వల్లభనేని

ఈ తరుణంలో ఆయనకు బిజెపి నుంచి మరోసారి ఆఫర్ వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి మీరే అని అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా మిమ్మల్ని ఎంపీగా చేస్తామనే సంకేతాలను బిజెపి పెద్దలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన ఆయన సిద్ధరామయ్యకు అలాగే ఒకసారి కుమారస్వామికి తన పదవిని త్యాగం చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని అవకాశం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ధీమా వ్యక్తం చేశారు.

కానీ రాహుల్ గాంధీ కొన్ని లెక్కలతో సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు అవినీతి ఆరోపణలు అలాగే ప్రభుత్వ పని తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం… ఇక డీకే శివకుమార్ కూడా ప్రభుత్వం పై సీరియస్ గా ఉన్నారనే ప్రచారం… కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై అసహనంగా ఉన్నారని వార్తలు నేపథ్యంలో బిజెపి రంగంలోకి దిగి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటకలో డికే శివకుమార్ ఉంటే తమకు దక్షిణాది రాష్ట్రాల్లో కొండంత బలం ఉంటుంది అనే భావనలో బిజెపి అగ్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం కర్ణాటక బిజెపి కీలక నాయకత్వం వృద్దాప్యంలో ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది బిజెపి అధిష్టానం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్