అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా తాజాగా ప్రస్తావించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. పలాంటిర్ టెక్నాలజీస్ సంస్థ గురించి.. చేసిన ప్రశంసలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఈమెయిల్లు రాయడానికో లేదా సాధారణ సమాచార విశ్లేషణకో పరిమితం కాలేదని, అది ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో వ్యూహాలను రచించే స్థాయికి చేరుకుందని ట్రంప్ బయటపెట్టిన ఓ అంశం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
Also Read : అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. రూ.12 వేల కోట్ల ట్రైటన్ డ్రోన్ మిస్సింగ్..!
పలాంటిర్ సాఫ్ట్ వేర్ కు అద్భుతమైన యుద్ధ సామర్థ్యాలు ఉన్నాయని నిరూపితమైందని ట్రంప్ పేర్కొన్నారు. దీని గురించి కావాలంటే మన శత్రువులను అడగండి అంటూ ఆయన కామెంట్ చేసారు. నిజానికి, పలాంటిర్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వాషింగ్టన్, వాల్ స్ట్రీట్ వెలుపల చాలా మందికి ఇప్పటి వరకు తెలియదు. కానీ, యుద్ధ రంగంలో ఏఐ పాత్ర ఏంటనేది ఇరాన్ యుద్ధం ఒక నిదర్శనంగా నిలిచిందని ట్రంప్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. అవసరమైన సమయంలో సైనిక కార్యకలాపాలను కృత్రిమ మేధ నిర్దేశించిన తీరు ఆసక్తిని రేపుతోంది.
Also Read : గర్భిణీ స్త్రీలు వాము తింటున్నారా..?
కేవలం డేటా విశ్లేషణ మాత్రమే కాకుండా, యుద్ధ క్షేత్రంలో శత్రువుల కదలికలను ముందే పసిగట్టి, తదుపరి అడుగును నిర్ణయించడంలో ఈ సాఫ్ట్వేర్ కీలక పాత్ర పోషించింది. పెంటగాన్ ఆదేశాల మేరకు, పలాంటిర్ సాఫ్ట్వేర్ భారీ మొత్తంలో ఉన్న ఉపగ్రహ చిత్రాలను, గంటల కొద్దీ డ్రోన్ ఫుటేజ్ లను అత్యంత వేగంగా జల్లెడ పట్టింది. మానవ మేధస్సుతో వారాల సమయం పట్టే ఈ ప్రక్రియను క్షణాల్లో పూర్తి చేసి, అమెరికన్ కమాండర్ల కోసం వెయ్యికి పైగా ఖచ్చితమైన దాడి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ స్థాయి ఖచ్చితత్వం, వేగం యుద్ధ రంగంలో అమెరికాకు ఒక పెద్ద ఆయుధంగా మారింది. నేడు పలాంటిర్ కేవలం ఒక సాఫ్ట్ వేర్ కంపెనీగానే కాకుండా, అమెరికా రక్షణ వ్యవస్థలో ఒక అంతర్భాగంగా ఎదగడం గమనార్హం.

