Sunday, March 22, 2026 08:46 AM
Sunday, March 22, 2026 08:46 AM

బ్రేకింగ్: అల్లు అర్జున్ అరెస్ట్… షాక్ లో టాలీవుడ్

పుష్ప సినిమా సూపర్ హిట్ కావడమేమో గాని ఇప్పుడు అల్లు అర్జున్ కు కొత్త సమస్యలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందు యాంటీ ఫ్యాన్స్ దెబ్బకు అల్లు అర్జున్ అల్లాడిపోయాడు. ఇక అవన్నీ తట్టుకుని సినిమా సూపర్ హిట్ అయి భారీ వసూళ్లు సాధించింది. వారం రోజుల్లోనే ఏకంగా 1067 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది పుష్ప 2 సినిమా. ఈ తరుణంలో పుష్ప సినిమాను ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి.

Also Read : అండర్ గ్రౌండ్ కు పేర్ని…? భార్య కోసం త్యాగం

ముఖ్యంగా అల్లు అర్జున్ కు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది పుష్ప 2 సినిమా. పుష్ప పార్ట్ 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా 70 ఎంఎం థియేటర్ కు వెళ్లడంతో అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ రావడంతో అక్కడ పోలీసులకు భద్రత కలిగించడం కూడా కష్టతరమైంది. భారీగా అభిమానులు రావడంతో స్వల్ప తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది.

Also Read : కేటిఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం… గవర్నర్ గ్రీన్ సిగ్నల్…?

దీనితో ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఒక చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. అనంతరం దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య ధియేటర్ యాజమాన్యంతో పాటుగా అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు అయింది. ఇప్పటికే పలువురిని ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని సంచలనం సృష్టించారు. తాజాగా అల్లు అర్జున్ ని కూడా ఆయన ఇంటి వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వెంటనే పోలీసు భద్రత నడుమ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేశారనే విషయం తెలిసిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్తున్నారు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ లాయర్లతో కలిసి అల్లు అర్జున్ కు స్టేషన్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అలాగే అల్లు అరవింద్ సహ మరి కొంత మంది సన్నిహితులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్