Wednesday, February 4, 2026 07:58 PM
Wednesday, February 4, 2026 07:58 PM

మాకేం తెలియదంటున్న మంత్రులు… నిజమెంతా..?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందనేది వైసీపీ నేతల ఆరోపణ. ఈ మాట నిజమే అన్నట్లుగా మంత్రుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కూటమికి చెందిన మంత్రులపై వరుసగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇవి ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. చివరికి తన దగ్గర పనిచేసే పీఏ అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసి తొలగించినట్లు హోమ్ మంత్రి వంగలపూడి అనిత స్వయంగా ప్రకటించారు. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. పీఏ అవినీతి చేస్తున్న విషయం మంత్రి గారికి తెలియదా.. అని కొందరంటుంటే.. అసలు పీఏ చేసిన అవినీతిలో మంత్రి గారి వాటా ఎంత అనేది వైసీపీ నేతల ప్రశ్న. దీంతో కూటమి నేతలకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి.

Also Read: హోంమంత్రి పిఏ పై వేటు.. కారణాలు ఇవే..!

తన ప్రైవేటు పీఏ జగదీష్ అవినీతికి పాల్పడుతున్నాడని హోమ్ మంత్రి వంగలపూడి అనిత స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి జగదీష్ కొత్తగా పీఏగా చేరిన వ్యక్తి కాదు. దాదాపు పదేళ్లు పైగా అనిత దగ్గరే ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే.. ఎమ్మెల్యేగా గెలవక ముందు నుంచే జగదీష్ కుటుంబం అనిత కుటుంబంలో కలిసిపోయింది. పిల్లలకు సపర్యలు చేస్తూ.. ఇంట్లో మనుషులుగా కలిసిపోయారు. అనిత ఓడిపోయినప్పుడు కూడా ఆమెతోనే ఉన్నాడు. పార్టీలో చాలా మందితో జగదీష్‌కు మంచి సంబంధాలున్నాయి. అనితకు తెలియకుండా జగదీష్ ఏమీ చేయడు అనేది పార్టీ నేతల మాట. అలాంటి జగదీష్ ఈ స్థాయిలో అవినీతి చేస్తుంటే.. మంత్రిగారికి తెలియకుండా ఉంటుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Also Read: టీడీపీలో సీనియర్లకు గుర్తింపు ఏదీ..?

ఇక ఇదే సమయంలో మరో ఉత్తరాంధ్ర మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అచ్చెన్నకు రెండోసారి మంత్రిగా అవకాశం కల్పించారు చంద్రబాబు. అయితే సీనియర్ అనే పేరున్న అచ్చెన్నపై కూడా ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో కింజరాపు కుటుంబ పెత్తనం పెరిగిపోయిందనే మాట బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అచ్చెన్న అవినీతి తారాస్థాయికి చేరిపోయిందని ప్రభుత్వంలో వినిపిస్తోంది. గతంలో కూడా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈఎస్ఐ స్కామ్ చేశారని వైసీపీ ప్రభుత్వంలో అచ్చెన్నను అరెస్టు చేశారు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. ఇప్పుడు కూడా మరోసారి అచ్చెన్నపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అచ్చెన్న మాత్రం ఈ ఆరోపణలపై నోరు ఎత్తడం లేదు.

Also Read: దావోస్ లో ఏపీ స్పెషల్ అట్రాక్షన్.. కేంద్రం ఫుల్ సపోర్ట్

ఇక తాజాగా మరో మంత్రి గురించి కూడా మీడియాలో కథనాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఏపీ మంత్రి తెలంగాణలో పెత్తనం చేస్తున్నాడని.. హైదరాబాద్‌లో భూ పంచాయతీలు చేస్తున్నాడని… ఈ విషయంపై మీరు దృష్టి పెట్టాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసినట్లు వచ్చిన కథనం ప్రకంపనలు రేపుతోంది. కోస్తా తీరానికి చెందిన ఓ మంత్రిపైనే ఈ ఆరోపణలు వచ్చినట్లు ఇప్పుడు పార్టీలో చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో మాత్రం ఆయన సోదరుడు పెత్తనం చేస్తుంటే.. సదరు మంత్రి గారు మాత్రం.. అమరావతిలో రివ్యూలు.. హైదరాబాద్‌లో దందాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ పుకార్ల వెనుక సత్యం ఎంతుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్