Wednesday, February 4, 2026 04:10 PM
Wednesday, February 4, 2026 04:10 PM

పసుపు పండుగ కోసం తెలుగు తమ్ముళ్లు రెడీ..!

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసే పసుపు పండుగకు సమయం ఆసన్నమైంది. మరి కొన్ని గంటల్లోనే పసుపు పండుగ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు అన్నీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు కూడా ఇప్పటికే కడప చేరుకున్నారు. తొలిసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్వహిస్తున్న పసుపు పండుగ చరిత్ర నిలిచిపోయేలా ఉండాలనే ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణ కార్యకర్త మొదలు… అధినేత వరకు ప్రతి ఒక్కరూ ఇది తమ ఇంటి పండుగ అన్నట్లుగా చేతులు కలుపుతున్నారు.

Also Read : నటుడు.. నాయకుడు.. అన్న ఎన్టీఆర్..!

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు మహానాడు అతి పెద్ద పండుగ. 1983 నుంచి ఇప్పటి వరకు పార్టీ అధికారంలో ఉన్నా.. లేకుండా మహానాడును మాత్రం ఘనంగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల కారణంగా ఒకటి రెండు సార్లు మహానాడు వాయిదా వేయాల్సి వచ్చింది తప్ప… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ నేతల బెదిరింపులను సవాల్‌గా తీసుకుని మరీ రెట్టించిన ఉత్సాహంతో మహానాడును నిర్వహించారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఒంగోలులో 2022లో జరిగిన మహానాడు. నాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మహానాడు నిర్వహిణకు ఎన్నో ఇబ్బందులు పెట్టింది. అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు కూడా వైసీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. అలాగే ప్రైవేటు వాహనాల్లో వచ్చే వారిని సైతం ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు నాటి పోలీసులు. అయినా సరే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం వెనుకడుగు వేయలేదు. కదం తొక్కారు. వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా జవాబిచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో జాతీయ రహదారిపై వందల కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. జై తెలుగుదేశం అనే నినాదంతో ఒంగోలు మారుమోగింది. చివరికి మహానాడు వేదిక వద్దకు చంద్రబాబు చేరుకునేందుకు కూడా కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇసుకేస్తే రాలనంత జనం ఒంగోలు మహానాడుకు పొటెత్తింది.

Also Read : కాకాణి అరెస్ట్.. వైసీపీలో కలవరం..!

ఒంగోలు మహానాడు స్ఫూర్తితోనే రెట్టించిన ఉత్సాహంతో పని చేసిన తెలుగు తమ్ముళ్లు.. ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా కష్టపడి పనిచేశారు. చరిత్రలో ఊహించని గెలుపు సొంతం చేసుకున్న టీడీపీ.. తొలిసారి కడపలో మహానాడు నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ 7 స్థానాల్లో గెలిచింది. ఈ ఫలితాలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాయి. దీంతో అదే ఊపులో కడపలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు. అందుకే ఈసారి మహానాడును కడపలో ప్లాన్ చేశారు. ఈ వేదిక నుంచే వైసీపీకి నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వైసీపీలో కొందరు కీలక నేతలు కూడా మహానాడు వేదిక మీద టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తోంది.

Also Read : రిటర్న్ గిఫ్ట్ కు థాంక్స్.. టాలీవుడ్ పై పవన్ ఫైర్

ఇక తెలుగు తమ్ముళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బస చేసేందుకు కుటీరాలు సిద్ధం చేశారు. 3 పూటల భోజన అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక చివరి రోజు ఏకంగా 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, పలావు, పులిహోర అందరికీ ఇవ్వనున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అన్ని మార్గాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ వంటలతో ప్రత్యేక రుచులు సిద్ధం చేస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూట్ మ్యాప్ ఇస్తున్నారు. పార్కింగ్ మొదలు.. వచ్చిన వారంతా తిరిగి వారి స్వస్థలాలకు చేరుకునే వరకు ఎలాంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కడప మహానాడు తెలుగుదేశం పార్టీకే కాదు.. దేశ రాజకీయాల్లోనే ఒక మైలురాయిగా మారనుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్